లక్కు కలిసొచ్చి కోట్లకు కోట్లు రావడం అంటే ఇదే... ! తలుపు తీసే దాకా అదృష్టం వెంటబడడం అంటే కూడా ఇదే. కాఫీ డే ఓనర్ విజి సిద్ధార్థ్ విషయంలో నిజంగా ఇదే జరిగింది. మైండ్ ట్రీ - ఎల్ అండ్ టి టేకోవర్ నేపధ్యంలో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన సిద్ధార్థ్ లక్ తెలిస్తే మనకు మతిపోతుంది. అంతటి భారీ డీల్ క్రాకర్ అయ్యారు ఆయన. రూ.340 కోట్లతో ఆయన మైండ్ ట్రీ ఐటీ కంపెనీలో కొన్న వాటా రూ.3000 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. అది కూడా ఓ కాఫీ షాపులో కుదిరిన డీల్‌తో..

ఎవరీ విజి సిద్ధార్థ
మైండ్ ట్రీ గురించి తెలుసుకునే ముందు ఓ సారి విజి సిద్ధార్థ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 58 ఏళ్ల ఇన్వెస్టర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన కాఫీ డే ఏర్పాటు చేయక ముందు ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అండ్ ట్రైనర్. కర్నాటకలోని చిక్‌మగ్లూరులో పుట్టిన సిద్ధార్థ మంగళూరులో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత 1983లో జెఎం ఫైనాన్షియల్‌లో స్టాక్ బ్రోకింగ్ డివిజన్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. ఆ అనుభవంతో ఏడాదికే శివన్ సెక్యూరిటీస్ అనే చిన్న స్టాక్ బ్రోకింగ్ సంస్థను కొనుగోలు చేసి దాన్ని మంచి ఇన్వెస్ట్‌మెంట బ్యాంకింగ్ - బ్రోకింగ్ సంస్థగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత దాన్ని వే2వెల్త్ సెక్యూరిటీస్‌గా 2000వ సంవత్సరంలో పేరుమార్చారు.

కాఫీ షాప్ పెట్టాలనిపించింది
స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం చేస్తున్న సమయంలోనే ఆయనకు 1992లో కాఫీ బిజినెస్‌లో అడుగుపెట్టాలని అనిపించింది. పుట్టిపెరిగింది అంతా కాఫీ తోటల మధ్యే కావడంతో ఆయనకు ఇది పెద్ద కష్టం అనిపించలేదు. అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ ట్రేడింగ్ అనే పేరుతో సంస్థను స్థాపించారు. (అదే ఇప్పుడు కాఫీ డేగా పేరు మారింది). కాఫీ గింజల సేకరణ, ప్రాసెసింగ్, రోస్టింగ్, రిటైలింగ్ దీని వ్యాపార ఉద్దేశం. అలా మొదలైన కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. కాఫీ బీన్స్ అమ్మకంతో మొదలై కాఫీ షాప్‌గా ఎదిగింది. 2018లో సంస్థ ఆదాయం రూ.2016 కోట్లంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1996లో బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో మొదటి కాఫీ డే మొదలైంది. అదే ఇప్పుడు 250 నగరాల్లో.. 1751 కాఫీ షాపుల స్థాయికి ఎదిగింది. మన దేశంలోనే కాకుండా చెక్ రిపబ్లిక్, వియెన్నా, మలేషియా, నేపాల్, ఈజిప్టులో కూడా కాఫీ డే షాపులున్నాయి.

మైండ్ ట్రీకి కాఫీ షాపులో బీజం.. భారీ డీల్
1998-99 మధ్య మైండ్ అశోక్ సూతా సహా మరికొంతమంది ఐటీ ఉద్యోగులు కాఫీ షాపుల్లో తరచూ భేటీ అవుతూ మైండ్ ట్రీ ఏర్పాట్లపై చర్చించేవారు. అదే సమయంలో సిద్ధార్థ దృష్టి వీళ్లపై పడింది. వాళ్లపై నమ్మకం కుదిరింది. తనకూ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన వ్యాపారంలో మొదట పెట్టుబడిపెట్టారు సిద్ధార్థ. 1999లో రూ.44 కోట్లతో సంస్థలో 6.6 శాతం వాటా కొన్నారు. అలా మొదలైంది వీళ్ల బంధం. అంతేకాకుండా కాఫీ డే సాక్షిగానే మైండ్ ట్రీ వ్యాపారం కొద్దికాలం సాగింది. అలాఅలా మైండ్ ట్రీ ఎదుగుతున్న కొద్దీ సిద్ధార్థ కూడా వాటాలు పెంచుకోవడం మొదలుపెట్టారు. వివిధ దశల్లో మొత్తం రూ.340 కోట్లు పెట్టి 20.43 శాతం వాటా కొన్నారు.
మైండ్ ట్రీ లిస్ట్ అయినప్పటి నుంచి సిద్ధార్థ దశ కూడా తిరిగింది. అయితే కాఫీ డే వ్యాపారంలో నష్టాలు వంటివి ఆయనను కొద్దిగా ఇబ్బందులకు గురిచేశాయి. భారీ విస్తరణ కూడా కలిసిరాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్తున్న టైంలో భారీ ఆఫర్‌తో ఎల్ అండ్ టి సంస్థ మైండ్ ట్రీని కొనుగోలు చేయాలని చూసింది. అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన సిద్ధార్థ కూడా ఇదే మంచి ఆప్షన్ అని భావించి మైండ్ ట్రీ వాటాలను అమ్మేశారు. దీంతో ఆయనకు ఉన్న రెండు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు పడ్తున్న టైంలో సెంటిమెంట్‌కు తావులేదనేది ఆయన స్ట్రాటజీ. అందుకే మంచి డీల్ రావడంతో ఇక ఆలస్యం చేయలేదు. రూ.340కోట్ల పెట్టుబడితో రూ.3000 కోట్ల లాభాన్ని మూటగట్టుకున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications