న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందా? అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అవుననే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం అక్షరాస్యుల్లో 2017 కంటే 2018లో నిరుద్యోగం పెరిగింది. అదే సమయంలో చదువుకోని వారిలో నిరుద్యోగం తగ్గింది. చదువుకున్న వారి పరంగా చూస్తే ప్రాథమిక విద్య, పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేట్ పరంగా చూస్తే.. గ్రాడ్యుయేట్ చదివిన వారిలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగింది.

నిరుద్యోగం, భారత్‌కు ఇదే ఆందోళన
ఉన్నత విద్యావంతుల్లో క్రమంగా నిరుద్యోగం పెరగడం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. 2018 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ఉన్నత చదువులు చదివిన వారిలో 13.2 శాతం నిరుద్యోగత ఉంది. అంతకుముందు ఏడాది (2017లో) 12.1 శాతంగా ఉంది. అంటే 1.1 ఏడాదిలో 1.1 శాతం పెరిగింది. ఈ మేరకు సీఎంఐఈ ఎండీ అండ్ సీఈవో మహేష్ వ్యాస్ ఆర్టికల్ రాశారు. ఇందులో కీలక అంశాలు రాశారు.

గ్రాడ్యుయేట్స్‌కు సరైన ఉద్యోగాల్లేవు
గ్రాడ్యుయేట్స్ అందరికీ భారత్‌లో సరైన ఉద్యోగాలు రావడం లేదని పేర్కొన్నారు. నిరుద్యోగం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమన్నారు. బాగా చదివిన వారిలోనే (ఉన్నత విద్యావంతులకు) నిరుద్యోగత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు వారు చదివిన విద్య ఆధారంగా కూడా లెక్క తీశారు. చదువు పెరుగుతున్న కొద్దీ నిరుద్యోగత పెరిగినట్లుగా ఈ స్టడీలో వెల్లడైంది. ఈ మేరకు ఐదు లెవల్స్‌గా విభజించి స్టడీ చేశారు. 1. నిరక్షరాస్యులు 2. ఐదో తరగతి చదివిన వారు 3. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు 4. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 5. గ్రాడ్యుయేట్స్‌గా విభజించి స్టడీ చేశారు.

ఏం చదువుకున్న వారిలో నిరుద్యోగం ఎంత శాతం ఉందంటే?
సెప్టెంబర్ - డిసెంబర్ 2018 మధ్య చేసిన ఈ స్టడీలో సరిసరిగా నిరుద్యోగత 6.7 శాతంగా ఉంది. నిరక్షరాస్యుల్లో నిరుద్యోగం తగ్గింది. 2017లో సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య 0.9 శాతంగా ఉండగా, 2018 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య 0.8 శాతానికి తగ్గింది. ఐదో తరగతి చదువుకున్న వారిలో 2017లో 1.0, 2018లో 1.3, ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుకున్న వారిలో 2017లో 3.1 నుంచి 2018లో 4.6 శాతం, 10వ తరగతి నుంచి 12వ తరగతి వారిలో 2017లో 7.4 శాతంగా ఉండగా, 2018లో 10.6 శాతం, గ్రాడ్యుయేట్స్‌లో 2017లో 12.1 శాతం ఉండగా, 2018లో 13.2 శాతం ఉంది.


Click it and Unblock the Notifications