ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ: తప్పించుకునేందుకు నీరవ్ మోడీ ఎన్ని ఎత్తులు వేశాడో తెలుసా?
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు మోసగించి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌లో ఓ బ్యాంకుకు వెళ్లిన అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఏడాదికి పైగా అక్కడ ఉంటున్నాడు. కానీ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. నీరవ్‌తో పాటు అతని మామ మెహుల్ చోక్సీ కూడా పారిపోయారు. వీరి గత ఏడాది జనవరిలో వెళ్లిపోయారు.

తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన నీరవ్ మోడీ
ఈ పదిహేను నెలలుగా తప్పించుకునేందుకు నీరవ్ మోడీ చేయని ప్రయత్నాలు లేవట. ఇందులో ప్లాస్టిక్ సర్జరీ మొదలు.. సౌత్ పసిఫిక్ ఓసియన్ నేషన్ అయిన వానౌతు దేశంలో సిటిజన్‌షిప్ (పౌరసత్వం) కోసం దర్యాఫ్తు చేసుకున్నారట. వానౌతు ఓ చిన్న దేశం. ఇది ఈస్ట్ ఆస్ట్రేలియాకు 1750కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. సింగపూర్‌లో శాశ్వత నివాసం కోసం కూడా ప్రయత్నాలు చేశాడట. మూడో దేశంలో (భారత్, బ్రిటన్ కాకుండా ఇతర దేశం) షెల్టర్ కావాలని బ్రిటన్‌కు చెందిన ఓ లా ఫర్మ్‌ను కూడా సంప్రదించాడట.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు
చివరకు తన ముఖ కవళికలు మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నాలు కూడా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. తన అంకుల్ మెహుల్ చోక్సీ వలె నీరవ్ మోడీ అంత చురుకు చెబుతున్నారట. నీరవ్ 2017లోనే ఆంటిక్వా, బర్దూడా దేశాల పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు సీబీఐ, ఈడీలు ఇంటర్‌పోల్‌ను సంప్రదించాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాయి.

అలా దొరికిపోయాడు
పదిహేను నెలల క్రితం నీరవ్, మెహుల్ ఛోక్సీ విదేశాలకు పోవడంతో వారి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇంటర్ పోల్‌ను ఆశ్రయించాయి. నీరవ్, ఛోక్సీలపై అరెస్టు వారెంట్ జారీ అయింది. అయితే నీరవ్ లండన్‌లోని వెస్ట్‌ఎండ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఇటీవల టెలిగ్రాఫ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో నీరవ్ ఆచూకీపై స్పష్టత వచ్చింది. గతేడాది జనవరి నుంచి నీరవ్ లండన్‌లోనే ఉన్నాడు. నీరవ్ ఆచూకీ బయటకు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో లండన్‌లోని మెట్రో బ్యాంక్ శాఖలో ఖాతా తెరవడానికి వచ్చిన నీరవ్‌ను అక్కడి సిబ్బంది ఒకరు గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని అతనిని అరెస్ట్ చేశారు. త్వరలోనే ఆయనను భారత్‌కు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Click it and Unblock the Notifications