ఉత్సాహంగా ప్రారంభమై, అంతే ఉత్సాహంతో ముగిసిన మార్కెట్

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు పెరగడంతో స్టాక్ మార్కెట్ల జోరు ఏడో రోజూ కొనసాగింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 11,500 మార్క్ పైన స్థిరపడింది. కొనుగోళ్ల అండతో ఉదయం సూచీలు జోరుగానే ప్రారంభమయ్యాయి. 38,218 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,396 గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 268 పాయింట్ల లాభంతో 38,363 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు ఎగబాకి 11,510 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్, రియాల్టీ, ఎఫ్ఎంసిజీ రంగ కౌంటర్ల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్ పరుగులు తీసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,500 పాయింట్లు అధిగమించినప్పటికీ దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ సుమారు 120 పాయింట్ల వరకు కోల్పోయింది. ఆఖరున మళ్లీ కొద్దిగా కోలుకుని ఆరు నెలల గరిష్ట స్థాయిపైనే ముగిసింది.

రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మద్దతిచ్చాయి. చివరకు నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11462 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 70 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్లు పెరిగాయి.

హెచ్ పి సి ఎల్, ఇండియన్ ఆయిల్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, బిపిసిఎల్, జెఎస్‌డబ్లు స్టీల్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. మారుతి, హీరో మోటో, విప్రో, భారతి ఎయిర్టెల్, హెచ్ సి ఎల్ టెక్ టాప్ 5 లూజర్స్‌గా మిగిలాయి.

మిడ్, స్మాల్ క్యాప్‌లో జోరు తగ్గింది రెండు వారాల నుంచి దూకుడు మీద ఉన్న స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ట్రెండ్ కాస్త నీరసించింది. గరిష్ట స్థాయిల దగ్గర ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంలో ట్రెండ్ పట్టుతప్పింది. రెండు ఇండెక్సులూ పావు శాతం వరకూ నష్టపోయాయి.

రియాల్టీ రంకెలు

రియాల్టీ రంకెలు

నేటి నుంచి ఎంబసీ రీట్స్ ఐపీఓ ప్రారంభమైంది. సుమారు రూ.4400 కోట్లను సమీకరించేందుకు ఎంబసీ - బ్లాక్ స్టోన్ సంస్థలు సిద్ధమయ్యాయి. దేశంలో మొట్టమొదటి రీట్స్ ఐపీఓకు మంచి స్పందనే వస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని వచ్చే అవకాశాలున్న నేపధ్యంలో దేశీయ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా ఎగిరి గంతేశాయి.

ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఏకంగా 16 శాతం లాభపడి ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. బ్రిగేడ్ 7.5 శాతం పెరిగింది. దీంతో పాటు గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐబి రియల్ ఎస్టేట్, ఒబెరాయ్ రియాల్టీ, శోభా స్టాక్స్ రెండున్నర శాతానికి పైగానే లాభపడ్డాయి.

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ బంపర్ డివిడెండ్

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ బంపర్ డివిడెండ్

గతేడాది లిస్ట్ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఏకంగా ఒక్కో షేర్‌కు రూ.19.80 డివిడెండ్ ఇచ్చింది. దీంతో ఇంట్రాడేలో స్టాక్ 6.5 శాతం లాభపడింది. చివర్లో కొద్దిగా లాభాల స్వీకరణ వచ్చింది. స్టాక్ 4 శాతం లాభపడి రూ.700 దగ్గర క్లోజైంది.

 స్టెరిలైట్‌లో ఆగని పతనం

స్టెరిలైట్‌లో ఆగని పతనం

వేదాంతా ఎఫెక్ట్ కారణంగా స్టెరిలైట్ టెక్నాలజీస్ స్టాక్ అంతకంతకూ పడిపోతోంది. ఈ రోజు కూడా యావరేజ్ వాల్యూమ్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువ జరిగింది. స్టాక్ మరో 5 శాతం కోల్పోయి రూ.219 దగ్గర క్లోజైంది.

మారుతి.. ఆఫ్ రోడ్

మారుతి.. ఆఫ్ రోడ్

మారుతి సుజుకి మెల్లిగా ప్యాసింజర్ కార్ మార్కెట్‌పై తన పట్టును కోల్పోతోంది. గతేడాది మార్చిలో ఏకంగా ఒక క్వార్టర్ పాటు ప్రొడక్షన్ కట్ చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ స్టాక్ 3 శాతం నష్టపోయి రూ.6910 దగ్గర క్లోజైంది.

జూబిలెంట్ గెయిన్స్

జూబిలెంట్ గెయిన్స్

డొమినోస్ పిజ్జా చైన్ ఆపరేటర్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తన వ్యాపారాన్ని బంగ్లాదేశ్‌కు విస్తరించింది. దీంతో స్టాక్ 3.5 శాతం పెరిగి రూ.1387 దగ్గర క్లోజైంది.

 10 నెలల కనిష్టానికి లుపిన్

10 నెలల కనిష్టానికి లుపిన్

లుపిన్‌కు చెందిన సబ్సిడరీ సంస్థ నోవెల్ ల్యాబొరేటరీస్‌కు యూఎస్ఎఫ్‌డిఏ నుంచి మరో కష్టమొచ్చిపడింది. తమ న్యూజెర్సీ ప్లాంట్‌కు అఫిషియల్ యాక్షన్ ఇండికేటెడ్ నోటీస్ అందింది. దీంతో స్టాక్ 10 నెలల కనిష్టానికి దిగొచ్చింది. ఇంట్రాడేలో 7 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 4 శాతం కోల్పోయి రూ.754 దగ్గర క్లోజైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+