For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా ఏడో రోజు పరుగులు పెట్టిన రూపాయి: మోడీ సహా కారణాలివే

|

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పరుగులు పెడుతోంది. మంగళవారం నాడు రూపాయి విలువ 68.59 వద్ద ప్రారంభమైంది. గరిష్ఠంగా 68.59 వద్ద, కనిష్ఠంగా 68.51 పాయింట్లకు చేరుకుంది. రూపాయి మారకం విలువ వరుసగా ఏడో రోజు పెరిగింది.

అన్నా, వదినలు ఆదుకున్నారు.. థ్యాంక్స్: అనిల్ అంబానీఅన్నా, వదినలు ఆదుకున్నారు.. థ్యాంక్స్: అనిల్ అంబానీ

సోమవారం నాడు 68.53 వద్ద ముగిసింది. ఇంటర్ పారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో సోమవారం ఒక్కరోజే 57 పైసలు లాభపడింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 161పైసలు లాభడింది. 2018 ఆగస్ట్ 1వ తేదీన రూపాయి ముగింపు 68.43గా ఉంది. ఆ తర్వాత రూపాయి మళ్లీ తాజాస్థాయిని చూడటం ఇది తొలిసారి.

 Rupee Opens Higher For Seventh Straight Session

శుక్రవాపం రూపాయి ముగింపు 69.10. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ఎక్స్‌చేంజ్‌లో 68.92 వద్ద పటిష్టంగా రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఓ దశలో 68.45 పాయింట్లకు చేరింది. ఇప్పుడు మంగళవారం నాడు 68.59 పాయింట్లకు చేరింది.

గత వారం రోజులుగా రూపాయి విలువ బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. లోకసభ ఎన్నికల తర్వాత మళ్లీ నరేంద్ర మోడీయే పగ్గాలు చేపడతారని చెప్పడం, డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం, క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్భణం కట్టడిలో ఉండటం, డాలర్ ఇండెక్స్ కదలికపై అనిశ్చితి వంటివి కారణాలుగా భావిస్తున్నారు.

English summary

వరుసగా ఏడో రోజు పరుగులు పెట్టిన రూపాయి: మోడీ సహా కారణాలివే | Rupee Opens Higher For Seventh Straight Session

Rupee has gained for the longest time given the positives since November 2018. In Tuesday's session also, rupee opened at 68.59 and made a low and high of 68.59 and 68.51, respectively.
Story first published: Tuesday, March 19, 2019, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X