మైండ్ ట్రీ ఇష్యూ: ఎల్ అండ్ టీకి బలవంతపు టేకోవర్ సాధ్యమేనా, ప్రభావం చూపేది వీరే?

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ మైండ్ ట్రీ టేకోవర్ గండం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కంపెనీలో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు చెందిన 20.32 శాతం వాటాను ఎల్ అండ్ టీ రూ.3,269 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌కు సంబంధించి సోమవారం ఇరవర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఎల్ అండ్ టీ దీంతో ఆగలేదు. మైండ్ ట్రీని తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు పావులు కదిపింది.

మైండ్ ట్రీ షేర్ హోల్డర్ల నుంచి మరో 31 శాతం మేర వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లిస్తామని చెప్పింది. ఓపెన్ ఆఫర్‌లో ఈ 31 శాతం వాటా కొనుగోలుకు రూ.5,030 అవుతుంది. ఇంత మొత్తం వెచ్చించేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైంది. మైండ్ ట్రీలో వీజీ సిద్ధార్థ ఇప్పటి వరకు పెద్ద వాటాదారు. ఆయన వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేయడంతో పాటు కంపెనీని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. 20 శాతం కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీకి మైండ్ ట్రీలో మరో 31 శాతం కొనుగోలు చేస్తే తమ నియంత్రణలో ఉంటుందని భావిస్తోంది. దీనిని (బలవంతపు టేకోవర్) షేర్ల బైబ్యాక్ ద్వారా అడ్డుకోవాలని మైండ్ ట్రీ భావిస్తోంది. బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు (మార్చి 20) మైండ్ ట్రీ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.

తొలి బలవంతపు టేకోవర్

తొలి బలవంతపు టేకోవర్

మైండ్ ట్రీని సొంతం చేసుకునేందుకు ఎల్ అండ్ టీ మొత్తంగా 66 శాతం వరకు వాటా కోసం రూ.10,800 కోట్లను ఆఫర్‌ చేస్తోంది. ముందుగా కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాను కొనుగోలు చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో బహిరంగ మార్కెట్‌ నుంచి మరో 15 శాతాన్ని సొంతం చేసుకోవడానికి బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు పెట్టింది. ప్రతిపాదిత కొనుగోలు 2019-20 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని అంటున్నారు. తమ వద్ద మొత్తం లావాదేవీలకు నిధులు ఉన్నాయని ఎల్ అండ్ టీ చెబుతోంది. కాగా, ఐటీ రంగంలో ఇది తొలి బలవంతపు టేకోవర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బలవంతపు టేకోవర్‌పై అభ్యంతరం

బలవంతపు టేకోవర్‌పై అభ్యంతరం

మైండ్ ట్రీ ప్రమోటర్లు, బోర్డు సభ్యులు బలవంతపు కొనుగోలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు, మదుపుదార్లు ఇందుకు సిద్ధంగా లేరని శనివారం నాడు... ఎల్ అండ్ టీ బోర్డు బోర్డు సభ్యుడు, సహ వ్యవస్థాపకులు కృష్ణకుమార్‌ నటరాజన్‌‌కు మైండ్ ట్రీ సీఈఓ రోస్తో రావణన్‌లు లేఖ రాశారని, అయినా మార్పు లేదని అంటున్నారు. బలవంతపు టేకోవర్‌ నుంచి కాపాడడం కోసం ఆదివారం మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి ఒడిశా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధిపతి పదవికి ఆదివారం రాజీనామా చేసి మరీ మైండ్‌ ట్రీకి వచ్చారు. బలవంతంగా మైండ్ ట్రీని పడగొట్టాలని చూస్తున్నారని, వారి నుంచి కాపాడుకునేందుకు తాను రాజీనామా చేసి బెంగళూరుకు వస్తున్నట్లు సుబ్రతో తెలిపారు. మైండ్ ట్రీ 2018-19లో ఇప్పటి వరకు పొందిన కాంట్రాక్టుల విలువ 16.8 శాతం పెరిగింది. వచ్చే ఏడాది 15.6 శాతం మేర డాలర్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ నియంత్రణ కోసం చూస్తోంది.

మైండ్ ట్రీలో ప్రభావం చూపగల సంస్థలు ఇవే

మైండ్ ట్రీలో ప్రభావం చూపగల సంస్థలు ఇవే

మైండ్ ట్రీలో నలంద ఇండియా ఫండ్ (10.61 శాతం), యూటీఐ (2.90 శాతం), అమాన్స హోల్డింగ్స్ (2.27 శాతం), వాన్ గార్డ్ (2.51 శాతం), ఎల్ అండ్ టీ ఎంఎఫ్ (1.08) శాతం ఉన్నాయి. ఇవి ప్రభావం చూపగలవు. అదే సమయంలో బలవంతపు టేకోవర్‌ను వ్యతిరేకించే వారిలో ఎన్ కృష్ణకుమార్ (3.72 శాతం వాటా), సుబ్రతో బాగ్చి (3.10 శాతం వాటా), ఎన్ఎస్ పార్థసారథి (1.43 శాతం వాటా), రోస్తో రావణన్ (0.71 శాతం)లతో పాటు 4.36 శాతం వాటా ఉన్న మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. బలవంతపు టేకోవర్‌ను వ్యతిరేకించే వారి వాటా 13.32 శాతం ఉంది. మూడు పెద్ద మ్యుచువల్ ఫండ్స్ దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

కీలక వాటాదారులు ఏం చేస్తారు?

కీలక వాటాదారులు ఏం చేస్తారు?

మరోవైపు, బెంగళూరుకు చెందిన మైండ్ ట్రీలోని మరికొందరు వాటాదారులు ఎల్ అండ్ టీ బహిరంగ ఆఫర్‌ను అంగీకరించేలా కనిపిస్తోందని అంటున్నారు. ఎక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేస్తే మైనార్టీ షేర్ హోల్డర్స్ అంగీకరించే అవకాశముందని అంటున్నారు. అయితే ప్రభావం చూపగల నలంద ఇండియా ఫండ్, యూటీఐ, అమాన్స హోల్డింగ్స్, వాన్ గార్డ్ వంటి సంస్థలు ప్రభావం చూపుతాయి. ఇవి తీసుకునే నిర్ణయంపై బలవంతపు టేకోవర్ ఆధారపడి ఉందని అంటున్నారు. ఈ సంస్థలు నో చెబితే ఎల్ అండ్ టీకి చుక్కెదురవుతుందని, ఒకే చెప్తే సులభం అవుతుందంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+