బెంగళూరు: మైండ్ ట్రీ బలవంతపు టేకోవర్ పైన ఎల్ అండ్ టీ వెనక్కి తగ్గింది. మైండ్ ట్రీ స్వతంత్రంగానే పని చేస్తుందని మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ ఎండీ, సీఈవో సుబ్రహ్మణ్యన్ మాట్లాడారు. తాము మైండ్ ట్రీని ఎల్ అండ్ టీలో విలీనం చేసుకోవాలని భావించడం లేదని, ప్రస్తుతానికి అది స్వతంత్రంగానే పని చేస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతానికే అని మెలిక పెట్టారు.

అందుకే ఈ ఆఫర్
పర్యవేక్షణకు మాత్రం బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఒకే విధంగా ఆలోచించే వ్యక్తులు కలవడంలాంటిదే ఈ ఒప్పందమని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. తమను సిద్ధార్థ మూడు నెలల క్రితమే కలిసి ఆయన వాటాలను విక్రయిస్తానని చెప్పారని, తమ సంస్థలోని పరిపాలన విలువను చూసి ఆయన ఈ ఆఫర్ చేశారని, మైండ్‌ట్రీలోని సీనియర్ మేనేజ్‌మెంట్ తమకు మంచి మిత్రులు అని, ఈ డీల్ తర్వాత మరింత సానుకూలపథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇది ప్రేమతో ముందుకు వెళ్లాల్సిన అంశమని, యుద్ధం కాదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయని, వాటిని దాటుకొని వెళ్లాల్సి ఉందన్నారు. ప్రేమ అనే పదం నేను ఉపయోగిస్తే, దానిని మనస్సు నుంచి అమలు చేస్తామన్నారు.

మైండ్ ట్రీ ఆగ్రహం
తాము మైండ్ ట్రీని బలవంతంగా హస్తగతం చేసుకోవాలనుకోవడం లేదని ఎల్ అండ్ టీ ఎండీ సుబ్రహ్మణ్యం చెప్పినకాసేపటికి.. మైండ్ ట్రీ బలవంతపు టేకోవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బోర్డ్ స్పందించింది. మైండ్ ట్రీని టేకోవర్ చేయాలని ఎల్ అండ్ టీ అనుకుంటే దానిని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మైండ్ ట్రీ చైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్ మీడియాతో మాట్లాడారు.

ఎల్ అండ్ టీకి మైండ్ ట్రీ ప్రశ్నల వర్షం
ఎల్ అండ్ టీ టేకోవర్‌లో తమకు ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం కనిపించడం లేదని ఆయన తెలిపారు. బలవంతపు టేకోవర్ ద్వారా తమ ప్రయత్నాలన్నీ తారుమారయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఎల్ అండ్ టీని ఆయన సూటిగా ప్రశ్నించారు. 1. ఎల్ అండ్ టీ అసలు మైండ్ ట్రీని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని, వారే ఓ ఐటీ కంపెనీని స్వతంత్రంగా స్థాపించుకోవచ్చు కదా? 2. భారతీయ ఐటీ చరిత్రలో ఓ కంపెనీని బలవంతంగా టేకోవర్ చేసుకున్నట్లుగా చరిత్రలో మీరు మిగిలిపోవాలనుకుంటున్నారా? 3. మైండ్ ట్రీ సంస్థ విలువలను ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? 4. దేశంలోని స్టార్టప్‌లకు ఎల్ అండ్ టీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications