ముంబై: జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మంగళవారం యాజమాన్యాన్ని ఆదేశించింది. జెట్ ఎయిర్‌వేస్‌ను నష్టకష్టాలు వెంటాడుతున్నాయి.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా లీజు చెల్లించలేకపోవడంతో మరో నాలుగు విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపేసింది. దీంతో రాకపోకలు ఆగిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల సంఖ్య 41కి చేరింది. ఈ నేపథ్యంలో జెట్ పరిస్థితులపై కేంద్రం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితులపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తన మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించారు. జెట్ ఎయిర్‌వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి తక్షణమే నివేదిక తీసుకురావాలని ఆదేశించారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. మూడు నెలలుగా తమకు జీతాలు అందలేని ఉద్యోగులు వాపోతున్నారు. జెట్ ఎయిర్‌వేస్ వద్ద 119 విమానాలుండగా అద్దె చెల్లించలేక 41 విమానాల నిలిపేశారు. విమానాల ఆకస్మిక రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, జెట్ ఎయిర్‌వేస్‌ను దివాళా నుంచి బయటపడేయాలని.. స్టేట్ రన్ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నందున కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications