వాషింగ్టన్: అమెజాన్ డాట్ కామ్ ఐఎన్‌సీ ఫౌండర్, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కొద్ది రోజుల క్రితం బహిర్గతమైంది. ఇది వివాదాస్పదమైంది. అమెరికాలోని నేషనల్ ఎంక్వయిరర్ అనే పత్రిక వీటిని ప్రచురించింది. జెఫ్ బెజోస్ అతని ప్రియురాలికి మధ్య జరిగిన సంభాషణ (మెసేజ్) బహిర్గతమైంది.

ప్రియురాలి సోదరుడే బహిర్గతం చేశాడు
దీనిని బహిర్గతం చేసింది ప్రియురాలు లూరెన్ సాంజెస్ సోదరుడే కావడం గమనార్హం. ఈ టెక్స్ట్ సందేశాన్ని 2 లక్షల డాలర్లకు అతను మీడియాకు అమ్మివేశాడు. విచారణలో ఈ విషయం తెలిసింది. ఈ ఏడాది జనవరి నెలలో ఎక్వయిరర్ పత్రిక జెఫ్ బెజోస్‌కు సంబంధించిన టెక్స్ట్ సందేశాలను ప్రచురించింది. అతనికి మాజీ యాంకర్ లూరిన్‌తో బెజోస్‌కు వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. ఈ విషయం వెలుగుచూడగానే జెఫ్ బెజోస్ సతీమణి విడాకులు ఇచ్చింది.

మీడియాకు సమాచారం
జెఫ్ బెజోస్ స్నేహితురాలు సాంజెస్ సోదరుడి పేరు మైఖేల్ సాంజెస్. అతనే మీడియాకు వారి మధ్య జరిగిన రహస్య సమాచారం ఇచ్చాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతోనే వారి మధ్య ఎలాంటి సంబంధం ఉందనే విషయం వెలుగు చూసిందట. అయితే ఎంక్వయిరర్ తమ కుటుంబంలో చిచ్చు రాజేసిందని, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందని జెఫ్ బెజోస్ గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

రెండు రకాల వాదనలు
ఈ వివాదంలో మరో ట్విస్ట్ కూడా కొనసాగుతోంది. జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తరుచూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను ఇబ్బందులకు గురి చేసిందని, ఈ నేపథ్యంలో ట్రంప్ ఆప్తుడైన ఎంక్వయిరర్ యజమాని రంగంలోకి దిగి ఈ జెఫ్ బెజోస్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగిన సందేశాలను సంపాదించారని అంటున్నారు. దీనిపై తాజాగా మరో పత్రికలో ఇంకో కొత్త కథనం వచ్చిందట. జెఫ్ బెజోస్ స్నేహితురాలు లేదా ప్రియురాలు లూరెన్ సోదరుడే ఈ వ్యవహారానికి అంతటికి కారణమని అంటున్నారు. రాజకీయ కారణాలతో ఆమె సోదరుడు వీటిని లీక్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. ట్రంప్ అంతర్గత మిత్రవర్గంలో అతను కూడా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తనపై అన్నీ అవాస్తవాలు ప్రచురితం అవుతున్నాయని జెఫ్ ప్రియురాలి సోదరుడు అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications