ప్రముఖ వాచ్‌లు, జ్యువెల్రీ సంస్థ టైటాన్ మార్కెట్ విలువ రూ.1 లక్ష కోట్ల మార్కుకు చేరనుంది. ఈ కంపెనీ స్టాక్ గత ట్రేడింగ్ సెషన్ రోజున రూ.1113ను దాటింది. తర్వాతి ట్రేడింగ్ సెషన్‌లో టైటాన్ ఈ క్లబ్‌లోకి చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు టైటాన్ మార్కెట్ క్యాప్ రూ.97212 కోట్లు. గత ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.98014 కోట్ల వరకూ చేరింది.
ప్రస్తుతం మన దేశంలో ట్రిలియన్ మార్క్ క్లబ్‌లోకి చేరిన లిస్టెడ్ సంస్థలు 27 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో టైటాన్ కూడా ఇప్పుడు చేరేందుకు రెడీ అయింది.
జీఎస్టీతో దశ మారింది
జ్యూవెల్రీ రంగంలో జీఎస్టీ అనూహ్య మార్పులు తీసుకువచ్చింది. అధిక మొత్తంలో వ్యాపారంలో అసంఘటిత రంగం నుంచి సమీకృతం వైపు మారుతోంది.
ఇది టైటాన్ వంటి సంస్థలకు మేలు చేస్తుంది. వరుసగా తొమ్మిది క్వార్టర్ల నుంచి మెరుగైన వృద్ధిని టైటాన్ నమోదు చేస్తూ వస్తోంది.

డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో సంస్థ 41.6 శాతం వృద్ధిని నమోదు చేయడంతో రూ.416 కోట్లకు చేరింది. జ్యువెల్రీ సెగ్మెంట్ పనితీరు మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణం. ఈ సెగ్మెంట్ ఏకంగా 37 శాతం వృద్ధిని నమోదు చేసింది.
క్రిసిల్ రిపోర్ట్
టైటన్ సంస్థ తీసుకున్న రుణాలకు (లాంగ్ టర్మ్ ఫెసిలిటీస్) క్రిసిల్ సంస్థ పాజిటివ్ ఔట్‌లుక్ ఇచ్చింది. సంస్థ ఇకపై కూడా మెరుగైన పనితీరును కనబరచవచ్చని క్రిసిల్ విశ్లేషిస్తోంది.
గత రెండేళ్లుగా టైటాన్ జ్యూవెల్రీ సెగ్మెంట్లో స్టోర్లను పెంచుంకుంటూ వస్తోంది. ఏటా 10-20 స్టోర్లకు బదులు 30-40 స్టోర్లకు చొప్పున విస్తరిస్తోంది. ఇప్పటికే 267 తనిష్క్, 25 మియా, 45 కారెట్‌లేన్ స్టోర్లను టైటన్ నిర్వహిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications