హైదరాబాద్ : సొంతిల్లు తీసుకోవడం ప్రతీ ఒక్కరికీ ఒక కల. దీని కోసం ఎంత కష్టానికైనా వెనుకాడారు. సొంత గూడు ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు అనే సెంటిమెంట్ భారతీయుల్లో ఎక్కువ. తలదాచుకునేందుకు ఓ చోటు ఉంటే చాలు..గుట్టుగా బతకొచ్చు అని నమ్ముతారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా హౌసింగ్ ఫర్ ఆల్, ప్రధాని ఆవాస్ యోజన వంటి పథకాలను రూపొందించడం వల్ల కొత్త ఇంటి కోసం తాపత్రయ పడే వారి సంఖ్య పెరిగింది. అయితే భార్యాభర్తా ఇద్దరూ ఉద్యోగులైతే వాళ్లకు రుణం విషయంలోనే కాకుండా పన్ను బెనిఫిట్స్ కూడా కలిసొస్తాయి. ఇంతకీ జాయింట్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఎలాంటి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయో ఓ సారి చూద్దాం.

సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సొంతంగా ఉంటున్న ఇంటిపై (రుణం తీసుకుని ఉంటే) ప్రతీ ఇండివిడ్యువల్ రూ.2 లక్షల వరకూ ఇంట్రెస్ట్‌పై డిడక్షన్ పొందొచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఈ బెనిఫిట్‌ను పొందొచ్చు. అయితే ఇక్కడ ఇద్దరూ జాయింట్ ప్రాపర్టీ హోల్డర్స్ అయితే ఇద్దరూ బెనిఫిట్ పొందొచ్చు.
ఉదాహరణకు ఒక వేళ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణంపై వడ్డీ రూ.5 లక్షలు కట్టారని అనుకుందాం. అప్పుడు ప్రతీ ఇండివిడ్యుయల్ రూ.2 లక్షల వరకూ మాత్రమే డిడక్షన్ పొందే వీలుంటుంది. ఈ కేస్‌లో ఇద్దరూ రూ.2 లక్షల చొప్పున క్లెయిం చేసుకోవచ్చు. ఆ వరకు వాళ్లు కట్టే ట్యాక్స్ తగ్గుతుంది.

జాయింట్ గా తీసుకోవడం వల్ల వడ్డీ ఉపశమనం
సాధారణంగా రుణం తీసుకున్న మొదట్లో కొన్ని సంవత్సరాలు వడ్డీ భారమే అధికంగా ఉంటుంది. ఇలా జాయింట్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఆ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఉదాహరణకు ఒక వేళ మీ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రూ.2 లక్షలే ఉందని అనుకుందాం. అప్పుడు ఎవరో ఒకరు పూర్తిగా రెండు లక్షలు, లేకపోతే ఒకొక్కరూ రూ.లక్ష చొప్పున మాత్రమే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్‌ను క్లెయిం చేసుకోవచ్చు. ఇద్దరూ చెరి రెండు లక్షలు క్లెయిం చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి.

అద్దెకు ఇచ్చిన ఇంటి విషయంలో..
ప్రాపర్టీ తీసుకుని దాన్ని అద్దెకు ఇచ్చి, దాని ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటే అదే రెంటల్ ఇన్‌కంలా పరిగణిస్తారు. ఇద్దరూ జాయింట్ ఓనర్స్ తక్కువ ఇన్‌కం శ్లాబ్‌లో ఉంటే దీని ఇద్దరూ క్లైం చేసుకోవచ్చు. ఉదాహరణకు అద్దెకు ఇచ్చిన ఇంటి ద్వారా ఏడాదికి రూ.1.20 లక్షల ఆదాయం వస్తోందని అనుకుందాం. అప్పుడు ఇద్దరూ ఓనర్స్ రూ.60 వేల చొప్పున రెంటల్ ఇన్ కం చూపించుకోవచ్చు. దీని వల్ల అధిక ట్యాక్స్ శ్లాబ్స్‌లోకి మారే అవకాశం కొద్దిగా తప్పుతుంది. ఉదాహరణకు ఒక వేళ సదరు ప్రాపర్టీపై వచ్చే ఆదాయం కంటే.. మీరు కడుతున్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని అనుకుందాం. దీన్ని రూ.4 లక్షలుగా భావిద్దాం. ఇక్కడ అసెసీ సదరు నష్టంలో కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఈ ఏడాది చూపించవచ్చు. తనకు వచ్చిన ఆదాయంలో రూ.2 లక్షలను నష్టం కింద చూపించి, మిగిలిన దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 2 లక్షల నష్టాన్ని రాబోయే ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఎడ్జస్ట్ చేసుకోవాలి. అదే జాయింట్ ప్రాపర్టీ అయితే ఒక్కో అసెసీ రూ.2 లక్షల చొప్పున నష్టాన్ని చూపించి ఒకే ఆర్థిక సంవత్సరంలో ఆ లాస్‌ను భర్తీ చేసుకోవచ్చు.

లెక్కల్లో పక్కాగా ఉండాలి
జాయింట్ ప్రాపర్టీ ట్యాక్స్ బెనిఫిట్ విషయాల్లో ఆదాయపు పన్ను శాఖ మరింత లోతుగా పరిశీలిస్తుంది. అందుకే సదరు ప్రాపర్టీ పై షేర్, ఫండింగ్ విషయంలో ఇద్దరూ పాల్పంచుకున్నట్టు కూడా ఆధారాలు మన దగ్గర ఉంచుకోవాలి. ఏదైనా స్క్రూటినీ జరిగినప్పుడు ఇబ్బంది పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications