రూపాయి నానాటికీ బలపడ్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ అనూహ్యంగా పుంజుకంటోంది. ఈ రోజు కూడా మరో 22 పైసలు బలపడి రూ.69.12కి చేరింది. వరుసగా నాలుగో రోజు కూడా లాభపడి 7 నెలల గరిష్ట స్థాయికి చేరింది రూపాయి మారక విలువ. నాలుగు సెషన్లలోనే రుపాయి 80 పైసలు తేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ డాలర్‌కు డిమాండ్ తగ్గడం, క్రూడాయిల్ స్థిరంగా ఉండడం, మన దేశంలోకి పెద్ద ఎత్తున విదేశీ నిధులు వెల్లువెత్తడం, ఈక్విటీ మార్కెట్లలో రికార్డ్ ర్యాలీ వంటివన్నీ రూపాయి బలపడేందుకు కారణాలు చెబ్తున్నారు ఎనలిస్టులు.

ఈ మూడు నెలల కాలంలో రూపాయి 4 శాతం, ఆరు నెలల కాలంలో 6 శాతం క్షీణించింది. అయితే ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 7 శాతం బలపడింది.
బలమైన ప్రభుత్వం వస్తే..
వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో బలమైన ప్రభుత్వం వస్తే రూపాయి మరింతగా తేరుకోవచ్చు. చైనా - అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెలల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నా అవేవీ ఒక కొలిక్కి రాలేదు. వివిధ దేశాలలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. యూరోప్, చైనా, అమెరికా దేశాల్లో వృద్ధి మందగిస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాలకు ఇది కలిసొస్తుంది కాబట్టి రూపాయి మరింతగా బలపడొచ్చు. మీడియం టర్మ్‌లో రూపాయి(డాలర్‌తో పోలిస్తే) రూ.67-69 మధ్య కదలాడేట్టు కనిస్తోంది. సాఫ్ట్‌వేర్ వంటి సేవలను ఎగుమతి చేసే సంస్థలకు, వస్తువులను ఎక్స్‌పోర్ట్ చేసే సంస్థలకు ఇది నెగిటివ్ న్యూసే అయినా ఇలా కరెన్సీతో తీవ్ర ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆర్బీఐ రంగంలోకి దిగి ధరలను స్థిరీకరిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications