For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్స్ అండతో గట్టెక్కిన నిఫ్టీ ! లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

By Chanakya
|

స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో దూసుకుపోతోంది. టెక్నికల్‌గా ఈ రోజు సూచీలు లాభాల్లో ముగిసినప్పటికీ కేవలం బ్యాంకింగ్, బ్యాంకింగ్ సంబంధ స్టాక్స్‌లోనే అధికయాక్టివిటీ ఉంది. టాప్ 5 నిఫ్టీ గెయినర్స్‌లో అన్నీ ఫైనాన్షియల్ స్టాక్స్ మాత్రమే ఉండడం ప్రధానంగా గమనించాలి. అడ్వాన్స్ - డిక్లైన్స్ లిస్ట్ 1:2గా ఉంది. అంటే ఒకస్టాక్ లాభపడితే.. రెండు స్టాక్స్ నష్టపోయాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా సాగిన మార్కెట్లకు మిడ్ సెషన్ తర్వాత ఊపొచ్చింది.

<strong>భార్య ,భర్తలం ఇద్దరం మాట్లాడుకోము..చందా కొచ్ఛర్</strong>భార్య ,భర్తలం ఇద్దరం మాట్లాడుకోము..చందా కొచ్ఛర్

కేవలం బ్యాంక్స్ అండతో నిఫ్టీ 40పాయింట్లు లాభపడి 11,342 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 37,752 దగ్గర ముగిసింది. అటు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 2019 ఏడాది గరిష్టంపైనే క్లోజయ్యాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, హెచ్ పి సి ఎల్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. భారతి ఎయిర్టెల్, వేదాంతా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ , సన్ ఫార్మా లూజర్స్ జాబితాలో చేరాయి.

బ్యాంక్ నిఫ్టీ.. కింగ్

బ్యాంక్ నిఫ్టీ.. కింగ్

బ్యాంక్ నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. ఈ రోజు మరో లైఫ్ టైం హై మార్క్ (28,927)ను టచ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ 28,884 దగ్గర క్లోజైంది. ఏకంగా 440పాయింట్లు లాభపడింది. అక్టోబర్ 2017 తర్వాత వరుసగా మూడో రోజు కూడా రికార్డ్ గెయిన్స్‌ను నమోదు చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి.

బ్యాంకుల మోత

బ్యాంకుల మోత

ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.5 శాతం, యెస్ బ్యాంక్ 3.7 శాతం, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 2.56 శాతం, ఎస్బీఐ 2.15 శాతం లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఎవరూ ఊహించనంత పటిష్ట స్థాయికి చేరింది. ఇక్కడి నుంచి కూడా మరింత పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. 30 వేల మార్కును బ్యాంక్ నిఫ్టీ త్వరలో టచ్ చేయొచ్చని టెక్నికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. రూపాయి మరింత బలపడి 2 నెలల గరిష్టానికి చేరడం, రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అదుపులో ఉండడం వంటివన్నీ కలిసొచ్చే అంశాలుగా

ఉన్నాయి.సెక్టోరల్ ఇండిసెస్ పరంగా చూస్తే ఈ రోజు మెటల్, ఫార్మా ప్యాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీడియా సహా ఐటీ రంగ కౌంటర్లు కూడా నష్టాల బాటపట్టాయి. పీఎస్‌యూ, ప్రైవేట్ బ్యాంక్స్‌కు తోడు రియాల్టీ సంబంధ స్టాక్స్‌లోనూ జోష్ ఉంది.

మిడ్, స్మాల్ క్యాప్స్‌లో జోష్ తగ్గింది

మిడ్, స్మాల్ క్యాప్స్‌లో జోష్ తగ్గింది

వరుసగా రెండు వారాల నుంచి పరుగులు తీసిన మిడ్,స్మాల్,మైక్రో క్యాప్ స్టాక్స్‌లో కొన్నింటిలో లాభాల స్వీకరణ నమోదైంది. లార్జ్ క్యాప్ స్పేస్‌లో ఎయిర్టెల్ 4 శాతం వరకూ కోల్పోయింది. మిడ్ క్యాప్ స్పేస్‌లో అవంతీ ఫీడ్స్, అపోలో హాస్పిటల్స్, జెకె సిమెంట్ వంటివి 4 శాతం వరకూ నష్టపోయాయి. స్మాల్ కేరాఫ్ స్పేస్‌లో సింప్లెక్స్ఇన్ఫ్రా, శాటిన్ క్రెడిట్ కేర్ 7 శాతం, అడ్వాన్స్డ్‌ ఎంజైమ్ 5 శాతం, హెస్టర్ బయో, సద్భావ్ ఇన్ఫ్రా వంటివి 5 శాతం వరకూ కోల్పోయాయి.మైక్రోక్యాప్ స్పేస్‌లో నిట్కో, రాంకీ ఇన్ఫ్రా, ఫియం ఇండస్ట్రీస్, జయభారత్ మారుతి, బటర్‌ఫ్లై గంధిమతి వంటివి నాలుగు శాతం వరకూ నష్టపోయాయి.

బోయింగ్ దెబ్బ

బోయింగ్ దెబ్బ

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ప్రమాదాలు తక్కువ కాలంలో రెండు జరగడంతో ఇప్పుడు వీటిపై ఆందోళన మొదలైంది. కొన్ని దేశాలు వీటిని రద్దు చేశాయి. మనదేశ డిజిసిఏ కూడా వీటిని తాత్కాలికంగా రద్దు చేసిం ది. దీంతో జెట్ ఎయిర్, స్పైస్ జెట్ స్టాక్స్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఎందుకంటే జెట్ ఎయిర్ దగ్గర నాలుగు, స్పైస్ జెట్ దగ్గర పన్నెండు 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి రద్దు నేపధ్యంలో అనేక సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.

అయితే ఇండిగో దగ్గర ఈ ఫ్లైట్స్ లేకపోవడం కలిసొస్తోంది. ఈ స్టాక్ మాత్రం 2 శాతం లాభపడి రూ.1296 దగ్గర క్లోజైంది.

English summary

బ్యాంక్స్ అండతో గట్టెక్కిన నిఫ్టీ ! లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ | Indian equity benchmarks ended higher for the third consecutive trading session

Indian equity benchmarks ended higher for the third consecutive trading session, closing at a fresh 2019 high.
Story first published: Wednesday, March 13, 2019, 20:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X