For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ దగ్గర 607 టన్నుల బంగారం, టాప్ 10 ప్లేస్‌కి చేరువలో భారత్

By Chanakya
|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెల్లిగా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. జనవరి నెలలో ఏకంగా 6.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో ఇప్పుడు మన దేశ అపెక్స్ బ్యాంక్ దగ్గర నిల్వలు 607 టన్నులకు చేరాయి. దీంతో మనం దేశంలోని టాప్ గోల్డ్ హోర్డింగ్ కంట్రీస్ జాబితాలో పదకొండో స్థానానికి చేరినట్టు వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది.

RBI inching towards becoming tenth largest holder of gold worldwide.

ఎవరెవరు ఏ స్థానంలో
జనవరి 2019 నాటికి ఉన్న లెక్కల ప్రకారం మొదటి స్థానంలో అమెరికా ఉంది. వీళ్ల దగ్గర 8133 టన్నుల బంగారం ఉంది. తర్వాతి స్థానంలో 2. జర్మనీ (3369 టన్స్), 3. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (2814 టన్స్), 4. ఇటలీ (2451 టన్స్), 5. ఫ్రాన్స్ (2436 టన్స్), 6. రష్యా (2119 టన్స్) 7. చైనా (1864 టన్స్), 8. స్విట్జర్లాండ్ (1040 టన్స్), 9. జపాన్ (765 టన్స్) 10. నెదర్లాండ్స్ (612 టన్స్) 11. భారత్ (607 టన్స్) 12. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (505 టన్స్) ఉన్నాయి. కొద్ది కాలం నుంచి నెదర్లాండ్స్ బంగారాన్ని అమ్ముతూనే వస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నేపధ్యంలో పదేళ్లుగా గోల్డ్ రిజర్వ్స్ తగ్గించుకుంటోంది. దీంతో ఇండియాలో పదో స్థానానికి త్వరలో ఎగబాకబోతోందని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది.

<strong>బ్లాక్ మని నగదు రూపంలో లేదు, నోట్ల రద్దును వద్దన్నాం</strong>బ్లాక్ మని నగదు రూపంలో లేదు, నోట్ల రద్దును వద్దన్నాం

RBI inching towards becoming tenth largest holder of gold worldwide.

అంత గోల్డ్ ఎందుకు
గోల్డ్‌ను హెడ్జింగ్ టూల్‌ అంటారు. ఏదైనా ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు కరెన్సీకి విలువ ఉండదు. అప్పుడు బంగారమే గట్టెక్కిస్తుంది. అందుకే ఎంత పెద్ద దేశమైనా, ఎంత పేద దేశమైనా తమ దేశ నిల్వల్లో బంగారానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు. తమ ఫారెక్స్ నిల్వల్లో గోల్డ్‌ను తప్పనిసరిగా ఉంచుకుంటారు.పరిస్థితలు చేజారిపోతే బంగారాన్ని అమ్మో, తాకట్టు పెట్టో అప్పు తెచ్చుకుంటారు. అందుకనే గోల్డ్ సహా అమెరికన్ డాలర్‌ను కూడా రిజర్వ్ కరెన్సీగా పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికన్ డాలర్ మెల్లిగా నీరసిస్తున్న నేపధ్యంలో వివిధ దేశాలు పుత్తడిపై ఫోకస్ పెంచాయి. వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరిలో ప్రపంచ బంగారం నిల్వలు 35 టన్నులు పెరిగాయి.

2018లో వివిధ సెంట్రల్ బ్యాంక్స్ 600 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తమ దగ్గర భధ్రపరుచుకున్నాయి.

Read more about: rbi gold ఆర్బీఐ
English summary

ఆర్బీఐ దగ్గర 607 టన్నుల బంగారం, టాప్ 10 ప్లేస్‌కి చేరువలో భారత్ | RBI inching towards becoming tenth largest holder of gold worldwide.

RBI inching towards becoming tenth largest holder of gold worldwide. Indian central bank may soon edge out its counterpart in Netherlands from the top-10 list, as latter's holding has largely remained unchanged.
Story first published: Tuesday, March 12, 2019, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X