దేశ వ్యాప్తంగా పది లక్షల మహిళలకు స్టెమ్ లో శిక్షణ అందివ్వనున్న ఐబిఎమ్
భవిష్యత్ లో తన ఉద్యోగుల కోసం ఐబీఎమ్ రంగంలోకి దిగింది..తమకు కావాల్సిన విధంగా విద్యార్థులను తయారు చేయాలని నిర్ణయించింది..ఈనేపథ్యంలోనే సుమారు పది లక్షల మంది మహిళలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా స్టెమ్ లో శిక్షణ ఇచ్చేందుకు సిద్దమైంది..ఇందుకు సంబంధించి ఆయా ,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది ఐబిఎమ్.

భవిష్యత్ ఉద్యోగాల్లో మహిళలే కీలక పాత్ర,
భవిష్యత్ ఉద్యోగాల్లో మహిళలలు కీలక పాత్ర పోషించనున్నారు..ఇందుకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ మెనేజ్ మెంట్ లో బాగంగా పది లక్షల మహిళకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు మేథమెటిక్స్ లలో సంబంధిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఐబీఎమ్ తెలిపింది.ఢిల్లిలో జరిగిన ఐబీఎమ్ ఇండియా స్కిల్స్ ఫోరమ్ లో సమావేశం లో భాగంగా పలు వివరాలు వెల్లడించారు.

100 శాతం మారిపోనున్న ఉద్యోగాల తీరు,
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో ఈ ఒప్పందాలను చేసుకుంది...కాగా భవిష్యత్ లో 100 శాతం ఉద్యోగాలు మారిపోనున్న నేపథ్యంలో కృత్రిమ మేధ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగం పెరుగుతుండడంతో హై స్కిల్డ్ ఉద్యోగుల అవసరం కూడ పెరుతుగుతుందని ఐబిఎమ్ చైర్మణ్ గిన్న రొమెట్టి తెలిపారు..ఈ ఉద్యోగాల్లో మహిళల అవసరం ఉంటుంది కాబట్టి 8 నుండి 12 వరకు చదివే సుమారు 2 లక్షల మంది మహిళ విద్యార్థులకు రానున్న మూడెళ్లలో స్టెమ్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మూడేళ్లలో రెండు లక్షలతో పాటు మొత్తం పది లక్షల మంది ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు ఆమే తెలిపారు.

శిక్షణ విధానం,
రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినిలకు స్టెమ్ క్లాస్ రూమ్, ఆన్ లైన్ శిక్షణ ఇచ్చి విద్యార్థులను ఆధునిక సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాల కోసం సిద్దం చేయనుంది.దీంతో పాటు టెక్నాలజీ లో శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్ మెంట్ , ఎంటర్ ప్రెన్యూర్ మంత్రిత్వ శాఖతో కలిసి రెండెళ్ల అడ్వాన్స్ డిప్లమో ప్రోగ్రామ్ ను రూపోందించింది. సుమారు 100 ఐటిఐ ల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో శిక్షణ పోందిన వారికి 5 నెలల పాటు ఐబిఎమ్ కూడ ఇంటర్న్ షిప్ కూడ ఆఫర్ చేయనుంది.దేశవ్యాప్తంగా 40 లక్షల మంది టీచర్లకు ఇండియన్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ కమ్యూనిటి ఫర్ స్టెమ్ లో విద్యా వనరులను కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేయనుంది.


Click it and Unblock the Notifications