ఆర్మీ. ప్రస్తుతం త్రివిధ దళాలపై మన దేశంలో ఎనలేని గౌరవ భక్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజా సర్జికల్ స్ట్రైక్స్, అభినందన్ అరెస్ట్ - విడుదల సమయంలో ఇవి మరింత తారా స్థాయికి చేరాయి. ఇప్పుడు దేశమంతా ఆర్మీ కోసం తాపత్రయపడ్తోంటే.. తాజాగా ఓ ఉదంతం జనాల్లో ఆవేశం పెంచేలా ఉంది. ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రముఖ సంస్థ కుప్పకూలడం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పాటు ఆర్మీ జనాల జీవితాలతో కూడా ఆటలాడిందని అర్థమవుతుంది. ఇక్కడ మొదలైన ఈ ఉదంతం చాలా బాధాకరమైన పరిణామంగా మారేట్టు ఉంది.

ఐఎల్ఎఫ్ఎస్ కుప్పకూలడం.. ఆర్మీకి ఎందుకు దెబ్బ !
ఐఏఎన్ఎస్ అనే వార్తా సంస్థ పరిశోధన ప్రకారం వివిధ ఆర్మీ కార్పస్ ఫండ్స్ ఐఎల్ఎఫ్ఎస్ త్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. వాళ్ల భవిష్యత్తుపై భరోసా కోసం మంచి రేటింగ్ ఉన్న ఈ బాండ్స్‌లో వివిధ ఆర్మీ ఉద్యోగులు, సంక్షేమ సంఘం భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరకుపోయి కుప్పకూలిపోవడంతో వీళ్ల భవిత ప్రశ్నార్థకంగా మారింది.

మూడు ఫండ్స్
ఆర్మీ ప్రధానంగా మూడు ఫండ్స్ నెలకొల్పింది. ఇందులో మొదటిది 1. ఆర్మీ వెల్ఫేర్ ఫండ్. యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ఏర్పాటైంది. 2016లో సియాచిన్ మంచు పర్వతం కుప్పకూలడం, పటాన్‌కోట్, యురీ ఎటాక్స్ సందర్భాల్లో ఈ ఫండ్స్ నెలకొల్పారు. వీటికి భారీగా అప్పట్లో జనాల నుంచి నిధులు వచ్చాయి. ఈ ఫండ్స్ ఎంత వచ్చాయి, ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
2. నేషనల్ డిఫెన్స్ ఫండ్. ఇది కూడా జనాల నుంచి డబ్బులు సేకరించే ఫండ్. డిఫెన్స్ ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ఆర్మ్, పారామిలిటరీ సిబ్బందిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అవసరార్థం ఈ ఫండ్ నెలకొల్పారు. మార్చి 2018 నాటికి ఈ ఫండ్ ఖర్చు రూ.64.75 కోట్లు. అయితే దీనికి రూ. 83.85 కోట్ల నిధులు వచ్చాయి. ఇప్పటికీ ఖాతాలో రూ.1115.18 కోట్ల నిధులు ఉన్నాయి.
3. ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఫండ్. యుద్ధాలు, మిలిటరీ ఎటాక్స్, బోర్డర్‌లో గొడవలు వంటి సమయాల్లో గాయాలపాలు కావడం, మరణించిన వాళ్ల కుటుంబాలకు ఈ ఫండ్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. రూ.15-20 లక్షలు ఒక్కో కుటుంబానికి చెల్లిస్తారు.
ఇలా మూడు విభాగాలుగా సర్వీస్‌మెన్ ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇలా సమీకరించిన మొత్తాన్ని మంచి రేటింగ్స్ ఉన్న బాండ్స్‌లో పెట్టబడి పెడ్తూ ఉంటారు. ఈ ఉదంతంలో కూడా ఐఎల్ఎఫ్ఎస్‌కు మంచి రేటింగ్ (ట్రిపుల్ ఏ) ఉండడంతో ఆర్మీ జనాలు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఐఎల్ఎఫ్ఎస్ దెబ్బతో ఈ నిధులన్నింటికీ మంగళం పాడుతుందా అనే ఆందోళన ఉంది.

ప్రభుత్వానికి మొర
అయితే ఎంత మొత్తంలో ఈ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు అనే అంశంపై ప్రస్తుతానికి మరికొద్ది క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే డిఫెన్స్ జనాలు ఐఎల్ఎఫ్ఎస్ అంశంపై కేంద్రానికి రెప్రెంజంటేషన్ ఇచ్చారు. ఇది ప్రైవేట్ సంస్థ కావడంతో దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత ఎన్నికలసీజన్‌లో ఇది కూడా రాజకీయ రంగు పులుముకుంటుందా అనే భయం కూడా ప్రభుత్వంలో ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో అత్యంత గోప్యతతో చాలా జాగరూకతతో వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications