ఆయనకు బ్యాంకు ఖాత ఉన్నట్టు తెలియదు.. అయినా పదికోట్ల లావాదేవీలు జరిగాయి, అందుకే 50 లక్షల ఇన్ కం టాక్స్ కట్టమని నోటిసులు సైతం వచ్చాయి..ఎవరిది బ్యాంకు అకౌంట్ ఎక్కడ జరిగింది ఈ విషయం....

నోట్ల రద్దు ఎఫెక్ట్...
నోట్ల రద్దుతో బ్యాంకుల్లో జరగని మోసాలు ఎన్నో జరిగాయి, తమ బ్లాక్ మని అప్పటికప్పుడు మార్చుకునేందుకు దందారాయుళ్లు అనేక మార్గాలను వెతికారు..సామాన్యుల ఖాతాల్లో కోట్లాది రుపాయల డబ్బులు జమ ఓ దిక్కు కాగా అసలు ఖాతాదారుడికి తెలియకుండానే కోట్లరుపాయల లావాదేవీలు జరిగాయి..దీంతో లక్షల కోట్ల రుపాయల నల్లధనం బయటికి తీయాలన్న కేంద్రం ప్రయత్నం అటుంచి డబ్బుమూటలున్న మయాల గారడీల ప్రయోజనం మాత్రం నెరవేరింది.కాగా వారి మాయల వల్ల సామాన్యులు ప్రస్థుతం ఇబ్బందులు పడుతున్నారు..తమది కాని డబ్బుకు లెక్కలు చెప్పాలంటూ ఆదాయపు శాఖ పంపుతున్న నోటిసులకు బెంబెలెత్తున్నారు,అయినా ఐటి శాఖ వదలకుండా నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు..దీంతో అసలు దొంగలు తప్పించుకోగా ఖాతాదారులు ఖంగు తింటున్నారు...

ఎక్కడ జరిగింది..
ఇలాంటీ సంఘటనే తాజగా సూరత్ లో జరిగింది..సూరత్ లోని సర్ఖానాలోని ప్రజా చౌక్ లో నివసించే లలిత్ సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు..అతని డాక్యుమెంట్లు వాడుకుని,సూరత్ లోని , ఐడిబిఐ బ్యాంక్ హీరా బాగ్ బ్రాంచిలో సుమారు పది కోట్ల రుపాయల లావాదేవీలు జరిగాయి..దీంతో పెండింగ్ లోఉన్న ఖాతాల లావాదేవీలను పరీశీస్తున్న ఆదాయపన్ను శాఖ వాటి దుమ్ముదులుపుతోంది..దీంతో లలిత్ ఖాత నుండి కూడ కోట్ల రుపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది..వెంటనే ఆయనకు 48 లక్షల రుపాయల ఆదాయపన్ను కట్టాలంటూ నోటీసులు కూడ జారి చేసింది..ఇందుకు సంభంధించి అయన సేవింగ్స్ ఖాతను సీజ్ చేసి రెండున్నర లక్షల రుపాయలను కూడ వసూలు చేసుకుంది..

తనకేం తెలియదు...
అయితే లలిత్ మాత్రం 2011 లో ఉమర్ వాడలో సేవింగ్ అకౌంట్ మాత్రమే తెరిచానని,అప్పుడు పాన్ కార్డ్ తో పాటు , ఇతర డాక్యుమెంట్లు ఇచ్చానని చెబుతున్నాడు..కాని తనకు ఇప్పటి వరకు ఎలాంటీ కరెంట్ ఖాతాలు లేవని చెబుతున్నారు.. తనకు ఏ బ్యాంకు ఖాతాలో లావాదేవీలు జరిగాయో కూడ తెలియవని వాపోతున్నాడు..ప్రస్థుతం లలిత్ ఉమర్ వాడ నుండి రెండు అడ్రస్ లు మార్చి సర్ఖానాలో ఉంటున్నారు.దీంతో పాత ఇంటియజమాని నోటిసు వచ్చిందని చెబితే ఆయను ఈ విషయం తెలిసింది...
కాగా సెల్స్ మెన్ గా పనిచేస్తున్న లలిత్ వారచ్ఛ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..పోలీసులు అసలు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications