ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనుకుంటున్నారా....అయితే ఏప్రిల్ వరకు ఆగండి,మీరు కొనుకున్నే టూ, త్రీ, మరియు ఫోర్ వీలర్ తోపాటు బస్సులకు కూడ కేంద్రం సబ్సిడి ప్రకటించింది..టూ వీలర్ కు 20 వేలు,ఈ రిక్షాలకు, [ఆటోలు] 50 వేలు, కారుకు లక్షన్నర,బస్సుకు 50 లక్షల చొప్పున సబ్సిడిని ప్రకటించింది...అయిది ఈ సబ్సిడిని ఏప్రిల్ నుండి అమలులోకి రానుంది.
కాలుష్యాన్ని ,డీజీల్ వాడకాన్ని తగ్గించడానికి
పెట్రోల్, డీజీల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ,కాలుష్యాన్నినివారించే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది..ఇందులో భాగంగానే విద్యుత్ వాహనాల తయారిని,మరియు వాడకాన్నిప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ''ఫేమ్ 2'' పథకాన్ని అమలు చేస్తోంది. కాగా ఈ పథకానికి 10 వేల కోట్ల రుపాయల బడ్జెట్ ను సైతం కేటాయించారు..కొద్ది రోజుల క్రితం మంత్రి వర్గ ఆమోదం కూడ లభించింది....కాగా ఏప్రిల్ నుండి సబ్సిడిని అందించాలని తాజాగా నిర్ణయించారు...

ఏ వాహానానికి ఎంత సబ్సిడి,
ఫేట్ 2 పథకం ద్వార సుమారు 10 లక్షల టూ వీలర్స్ కు సబ్సిడిని అందించనున్నారు..ఒక్కో టూ వీలర్ కు 20 వేల రుపాయల సబ్సిడిని ప్రకటించారు.. 5 లక్షల ఈ రిక్షాలకు సబ్సిడి ఇవ్వనుండగా ఒక్కో రిక్షాకు 50 వేలు , కారుకు లక్షన్నర, 7000 వేల ప్యాసింజర్ బస్ లకు గాను ఒక్కోదానికి రూ. 50 లక్షల సబ్సిడిని అందించనున్నారు.. మొత్తం పదివేల కోట్లను మూడు సంవత్సరాలుగాను ఖర్చుపెట్టనున్నారు. వీటి కేటాయింపులకు సంభంధించి మొదటి 2019-20 ఆర్దిక సంవత్సరానికి గాను 1500 కోట్లు రెండవ సంవత్సరంలో 5000 వేల కోట్లు , కాగా మూడవ సంవత్సరానికి 3500 కోట్లు ఖర్చుపెట్టనున్నారు..
ఇతర టాక్స్ ల మినహాయింపు,
దీంతోపాటు ఈ పథకం క్రింద రోడ్డు టాక్స్ మినహయింపు, రిజిస్ట్రేషన్ రుసుము లేకపోవడం, పార్కీంగ్ చార్జీలను వర్తింపజేయకపోవడం వంటి ప్రోత్సహకాలు ఉండనున్నయి...అయితే టూ వీలర్ మినహా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ కు మాత్రమే ఈ సబ్సిడిని అందించనున్నారు..మొత్తం మీద ఫేమ్ 1 ఏప్రిల్ 2015 లో ప్రారంభం కాగ, ఏప్రిల్ 2019 లో ఫేమ్ టూ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.


Click it and Unblock the Notifications