ముంబై: దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఇంతవరకూ ఏ బ్యాంక్ చేయని సాహసాన్ని చేసింది. వడ్డీ రేట్లను బెంచ్ మార్క్ (ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ రేట్)కు అనుసంధానిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీని వల్ల మనకు ఏంటి ప్రయోజనం అనుకోవచ్చు ? డిపాజిట్లు చేసిన వాళ్లు, రుణాలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ ఈ నిర్ణయంతో ప్రభావితం అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే లక్షలాది మంది దీని గురించి ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏంటీ ఆటోపైలెట్
..
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలలకో సారి వడ్డీ రేట్లను పునఃసమీక్షిస్తూ ఉంటుంది. పెంచడమే లేదా తగ్గించడమో చేస్తూ ఉంటుంది. దీని వల్ల అప్పులు తీసుకున్న వాళ్లూ, బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వాళ్లకు వడ్డీల్లో మార్పులు ఉంటాయి. కానీ అధిక శాతం ఏం జరుగుతుంది అంటే.. ఆర్బీఐ రేట్లను సవరించిన ప్రతీసారీ బ్యాంకులు అదే బాటలో మార్పులు చేయవు. దీనిపై ఆర్బీఐ కూడా అనేక సందర్భాల్లో బ్యాంకులపై విమర్శలు చేసింది.

ఎస్బీఐ స్పెషల్ ఏంటి..
ఇప్పుడు ఎస్బీఐ తన వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంబ్ మార్క్‌లకు లింక్ చేసింది. దీని వల్ల ఆర్బీఐ ఎప్పుడు వడ్డీ రేట్లు సవరించినా ఎస్బీఐ రేట్లు కూడా అందుకు తగ్గట్టే తక్షణం మారిపోతాయి. వాస్తవానికి దీనికి ఆర్బీఐ అనుమతి కూడా ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తోంది. ఇంత వరకూ ఏ బ్యాంకూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్‌పై 2.75 శాతం, షార్ట్ టర్మ్ లోన్స్‌పై 2.25 శాతం స్ప్రెడ్‌ను నిర్ణయించింది. అంటే ఈ లాభాల మార్జిన్‌ను ఉంచుకుని బ్యాంక్ తన వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.అయితే ఇవన్నీ లక్ష రూపాయలకుపైగా ఉన్న డిపాజిట్లకే వర్తిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది.
అయితే ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న కస్టమర్లకు పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. ఒక వేళ రుణం తీసుకున్న వాళ్లైనే, లేక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ దారులైనా కూడా. ఇలాంటి నిర్ణయం హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్లకు, లేదా రూ. లక్షకు పైగా పర్సనల్ లోన్, వెహికల్ లోన్స్ తీసుకున్న వాళ్లకూ, బిజినెస్ లోన్ వాళ్లకు వర్తిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆటోపైలెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఊరటనిస్తాయి.


Click it and Unblock the Notifications