For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండో వారం తగ్గిన బంగారం ధరలు, రూ.600 తగ్గుదల

|

ముంబై: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. వరుసగా రెండు వారాలు ధరల్లో తగ్గుదల కనిపించింది. ఈ వారం 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర తగ్గింది. దీంతో రూ.33,170 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, స్థానిక జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ లేకపోవడం తదితర కారణాలతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది.

దిగుమతి చేసుకునే బంగారం చౌకగా దొరుకుతోంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. అలాగే, ఈక్విటీ మార్కెట్ వైపుకు నిధులు తరలిస్తున్నారు. దీంతో స్థానిక జ్యువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గుతోందని చెబుతున్నారు. గ్లోబల్ బంగారం ధరలు ఒక ఔన్స్‌కు 1298.70 డాలర్ల వద్ద, వెండి ఔన్స్ ధర 15.31 డాలర్ల వద్ద ముగిసింది.

Gold prices dip for another week

దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర 33,450 వద్ద ప్రారంభమైంది. 33,070 వద్ద కనిష్టత నమోదు చేసుకుంది. చివరకు ఈ వారం రూ.600 తగ్గి రూ.33,170 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు రూ.33వేల వద్ద క్లోజ్ అయింది.

English summary

వరుసగా రెండో వారం తగ్గిన బంగారం ధరలు, రూ.600 తగ్గుదల | Gold prices dip for another week

The slide in gold prices continued for yet another week, with the yellow metal losing Rs 600 to close at Rs 33,170 per ten grams at the bullion market, tracking a weak trend overseas amid tepid demand from local jewellers.
Story first published: Sunday, March 10, 2019, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X