స్విఫ్ట్ నిబంధనలు పాటించని 36 బ్యాంకులపై రు. 71 కోట్ల జరిమాన విధించిన ఆర్బీఐ
బ్యాంకుల ఆర్ధిక లావాదేవీలపై పటిష్ట భద్రత తీసుకువచ్చేందుకు ఆర్బిఐ తీవ్రంగా కృషి చేస్తుంది..ఈనేపథ్యంలనే సరైన నిబంధనలను అమలు చేయని బ్యాంకులపై కోట్లాదీ రుపాయాల జరిమాన విధిస్తోంది..
ఈ నేపథ్యంలోనే తాజాగా స్విప్ట్ నిబంధనలు పాటించని మొత్తం 36, ప్రైవేట్ ,ప్రభుత్వ రంగ బ్యాంకులపై 71 కోట్ల రుపాయల జరిమాన విధించింది కాగా వీటిని జనవరీ 31 నుండి ఫిబ్రవరి 25 వరకు ఈ జరిమానలు విధించింది..ఆర్బీఐ.కాగా స్విఫ్ అనేది గ్లోబల్ మేనేజింగ్ సాఫ్ట్ వేర్.స్విస్ట్ ఆర్ధిక సంస్థలు తమ లావాదేవీల కోసం వినియోగిస్తున్నాయి..

ఈ నిబంధనలు సరిగా పాటించని కారణంగానే పంజాబ్ నేషనల్ బ్యాంకు లో వేల కోట్ల కుంభకోణం వెలుగుచూసింది..దీంతో స్విఫ్ట్ ను నిబంధనలు అమలు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారి చేసింది ఆర్బీఐ, అయితే ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కుతున్న బ్యాంకులపై ఆర్బీఐ కన్నేర్ర చేస్తోంది..
దీంతో వాటిపై రూ కోటి నుండి నాలుగు కోట్ల వరకు జరిమానలను విధిస్తోంది..జరిమాన విధించిన బ్యాంకులు,ఎస్బీఐ,బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ,సిటి యూనియన్ బ్యాంక్,హెచ్ఎస్బీసీ,ఇండియన్ బ్యాంక్,కర్ణాటక బ్యాంక్,యోన్ బ్యాంక్,అలహాబాద్ ,డీసీబీ,దేనా బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications