మీ ఇంటికే వచ్చి బంగారం లోన్ ఇస్తామంటున్న అంటున్న మణప్పురం గోల్డ్ లోన్స్
మీరు గోల్డ్ లోన్ కావాలనుకుంటున్నారా..అయితే గోల్డ్ లోన్ కార్యాలయానికి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి గోల్డ్ లోన్ కు సంబంధించి ప్రాసెస్ పూర్తి చేసి, ఇంటివద్దే గోల్డ్ లోన్ ఇస్తామంటున్నాయి గోల్డ్ ఫైనాన్స్ కంపనీలు.

దేశంలో బంగారంపై రుణాలు ఎక్కువ ..
దేశంలో బంగారం పై వ్యాపారాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. తమ అవసరాల కోసం బంగారాన్ని తకట్టుపెట్టి రుణాలు తీసుంటున్న వారి సంఖ్య పేరుగుతోంది....ఈనేఫథ్యంలోనే గోల్గ్స్ లోన్ కంపనీలు వినియోగాదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సిద్దమవుతున్నాయి.. సంబంధింత ఫైనాన్స్ కంపనీకి ఫోన్ చేస్తే చాలు తమ ఇంటివద్దకే వచ్చి లోన్ ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు...

బంగారాన్ని నగరాల్లో తీసుకెళ్లడం కష్టమే ..
సాధరాణంగా పెద్ద పెద్ద నగరాల్లో విలువైన వస్తువులు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది..అది లక్షల రుపాయల విలువ చేసే బంగారం అయితే మరి కష్టం..చైన్ స్నాచర్స్ తోపాటు దోంగల బెడద ఎక్కువగా ఉంటుంది..దీంతో జాగ్రత్తగా ఎవరి కంట కనబడకుండా బంగారాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది...వినియోగదారుల ఇబ్బందులను గుర్తించిన మణప్పురం గోల్డ్ లోన్ కంపనీ నేరుగా వినియోగదారుల వద్దకే వచ్చి లోన్ ప్రాసెస్ చేస్తుంది..ఇంటివద్దే డబ్బులు ఇస్తున్నారు.లోన్ కు సంబంధించి చేయాల్సిన ప్రాసేస్ తమ ఉద్యోగుల ద్వార చేయిస్తామని ప్రకటించింది..

చెన్నై, బెంగుళూర్, ఢిల్లి, ముంబై నగరాల్లో డోర్ టు డోర్ సర్వీసు..
ఇందులో భాగంగానే మణప్పురం గోల్డ్ లోన్ కంపనీ లోన్ చెన్నై, బెంగూళూర్ లలో డోర్ టూ డోర్ సర్వీసు చేస్తోంది.. దీన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలకు సిద్దం చేసింది..దీన్ని మరిన్ని నగరాలకు కూడ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది..తాజాగా ఢిల్లి, ముంబై నగరాల్లో కూడ ఈ సదుపాయాన్ని కల్గిస్తున్నట్టు ప్రకటించింది..సో భవిష్యత్ కూడ ఇది మరిన్ని నగరాలకు కూడ విస్తారించాలనే ఆలోచన కూడ చే్స్తున్నట్టు కంపనీ ప్రకటించింది దీంతో వినియోగదారులకు కొంత సమయంతో పాటు భద్రత పరమైన బాధలనుండి విముక్తి కల్గనుంది....


Click it and Unblock the Notifications