అమ్మాయి అడిగితే చాలు ఏదైన చెప్పేస్తాం....
హలో సార్ మీ మొబైల్ నంబర్ పై ఆఫర్లు ఉన్నాయి..మీ డిటేయిల్స్ చెప్పండి, మీకు కోటి రుపాయల నగదు బహుమతి వచ్చింది, మీ బ్యాంకు ఖాత వెరిఫికేషన్ కోసం ఫోన్ చేస్తున్నాం, వివరాలు ఇవ్వండి , అంటూ స్వీటుగా మాట్లాడే అమ్మాయిల ఫోన్లు మీకు వస్తున్నాయా..అయితే జాగ్రత్తగా ఉండండి అమ్మాయిల మాటలకు హోయలు పోయి స్వీటుగా వివరాలు చెప్పద్దు, చెబితే మీరు హటుగా మారి పోవడం ఖాయం...
మీ బ్యాంకు ఖాత వివరాలు ఎవరికి చెప్పవద్దు ,బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నమని చెప్పినా సరే, తెలియని వారికి వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి లాంటీ ప్రకటనలు చెవిలో జోరెత్తుతున్నా, కొందరు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు, అమ్మయిల మాటలు లేదా బహుమతులు,నజరాలకు ఆశపడో తెలియదు కాని తాజాగా మరో సంఘటన ఇలాంటీదే కడప జిల్లాలో జరిగింది.

కడప జిల్లా రైల్వే కోడూరు మంగంపేటకు చెందిన శివప్రసాద్ స్థానిక ఆసుపత్రిలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు..ఒక రోజు మధ్యహ్నం డ్యూటి ముగించుకుని ఇంటికి వెళ్లిన అనంతరం శివశంకర్ నిద్రపోయాడు.ఇంతలోనే ఓ అమ్మాయినుండి ఫోన్ వచ్చింది సర్ మీ బ్యాంక్ ఖాతాపై నగదు ఆఫర్లు ఉన్నాయి ,మీ ఖాతా వివరాలు చెప్పండి అంటూ అడిగింది..అడిగిందే తడవుగా శివప్రసాద్ ఖాత వివరాలు చెప్పాడు, మరి కాసేపటికి ఓటిపి నెంబర్ సైతం చెప్పండి అంటూ ఫోన్ రావడంతో నెంబర్ చెప్పాడు .ఇంకేముంది సైబర్ నేరగాళ్లు శివప్రసాద్ ఖాతాలోకి వెళ్లి వెంటనే 20000 రుపాయలు ఆయన ఖాతా నుండి కట్ అయినట్టు మెసెజ్ వచ్చింది..దీంతో అలర్ట్ అయిన శివప్రసాద్ పోలీసులకు పిర్యాదు ఇచ్చేందుకు బయలుదేరాడు ఈ లోపే మరో 40 వేల రుపాయలు కట్ అయినట్టు మెసెజ్ రావడంతో శివప్రసాద్ ఖంగుతిన్నాడు..నేరుగా వెళ్లి రైల్వే కోడూరు ఎస్బీఐ బ్రాంచీ లో విషయం చెప్పాడు ,ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆన్ లైన్ పేటిఎమ్ ద్వార బదీలీ అయినట్టు తెలిపారు..దీంతో శివప్రసాద్ పోలీసులకు పిర్యాధు చేశాడు,
సో ఇకనైన్ బ్యాంకు వివరాలు కాని , ఓటిపి వివరాలు కాని ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుండి మరి...


Click it and Unblock the Notifications