హైదరాబాద్ : 799 రూపాయలకే ఫ్లైట్ జర్నీయా? అన్ని రూట్లలో కూడా ఇదే ధరనా? అంటే అవుననే అంటోంది ట్రూజెట్ విమానయాన సంస్థ. మార్చి 8 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. ట్రూజెట్ పేరుతో విమానయాన రంగంలో రాణిస్తున్న టర్బో మెగా ఎయిర్ వేస్ "గ్రేట్ టేకాఫ్ సేల్" ను ప్రకటించింది. వినియోగదారును ఆకట్టుకునే విధంగా తక్కువ ధరకే ఫ్లైట్ జర్నీ అవకాశం కల్పిస్తోంది.
దాదాపు అన్ని రూటల్లో బేస్ ఫెయిర్ 799 రూపాయలు కాగా పన్నులు అదనం. మార్చి 8 నుంచి 17వ తేదీ మధ్యలో బుకింగ్ చేసుకుని.. మార్చి 8 నుంచి అక్టోబర్ 26 వరకు ప్రయాణించేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. గ్రేట్ టేకాఫ్ సేల్ లో భాగంగా దాదాపు లక్ష సీట్లను 799/- కింద ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు ట్రూజెట్ సీసీవో సుధీర్ రాఘవన్.

ఉడాన్ ప్రాజెక్టు ఆసరాగా స్కై ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కింద చిన్న పట్టణాలతో మెట్రో నగరాలను లింకప్ చేస్తోంది ట్రూజెట్. మరోవైపు కంపెనీని వృద్ధి చేసే క్రమంలో వెబ్ సైట్ కు కొత్త సొబగులు అద్దింది. అంతేకాదు ఎయిర్ లైన్ ఇమేజ్ ను రీ బ్రాండ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అందులోభాగంగా ట్రూ జెట్ సిబ్బంది ఇకపై కొత్త డ్రెస్ కోడ్ లో ప్రయాణీకులకు సేవలందిస్తారని వివరించారు సీఈవో ఎల్ఎస్ఎన్ మూర్తి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications