ప్రైవేట్ సంస్థలు ఆధార్ డాటాను ఉపయోగించుకుంటే ఇక నుండి చార్జీలు చెల్లించాలి..ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూఐడిఏ , ప్రతి వెరీఫికేషన్ కు 20 రుపాయాలు చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కోన్నారు.

ప్రైవేటు సంస్థలు ఆధార్ వాడుకున్నంధుకు చార్జీలు చెల్లించాలి,
అన్నింటికి ఆధార్ ,ఆధార్ లేకుండా ఏ ఒక్క పని కావడంలేదు, ఆర్ధిక లావాదేవిలతో పాటు కనీస గుర్తింపు కార్డుగా ఆధార్ పనిచేస్తుంది. దీంతో ప్రతి ప్రైవేట్ సంస్థ తమ కార్యకాలపాలకు ఆధార్ ను అడుగుతున్నారు..సెక్యురిటి పరంగా అన్నింటికి ఆధార్ ను ఉపయోగిస్తున్నారు..సాధారణంగా మొబైల్ ఫోన్ కంపనీలయితే ఆధార్ లేకుండా కనెక్షన్ ఇవ్వడం లేదు.. ఇంత పెద్ద అవససరం ఉన్న ఆధార్ డాటాను యూఐడిఏ ఆదాయ వనరుగా మార్చుకోనుంది..

ప్రతి వెరిఫికేషన్ కు రూ.20
ఈనేపథ్యంలోనే తమ ఆధార్ సర్వీసులను వాడుకున్నందుకు గాను వ్యాపార సంస్థలు ఫీజులు చెల్లించాలని యూఐడిఏ ప్రకటించింది.ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కు ఆయా వ్యాపార సంస్థలు రూ.20 చెల్లించాలని ,ప్రతి ధ్రువీకరణ సర్వీసు వాడుకున్నందుకు 50 పైసలు చెల్లించాలని యూఐడిఏ తన నోటిఫికేషన్ లో పేర్కోంది. ఆధార్ రెగ్యులేషన్ 2019 కింద ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపింది.

కొన్నింటీకి మినహయింపు
అయితే ఈ చార్జీల నుండి ప్రభుత్వ సంస్థలను, పోస్టల్ డిపార్ట్మెంట్ తో కమర్షీయల్ బ్యాంకులను మినహయించింది

ఎందుకు చార్జీలు
పేపర్ ,ఫిజికల్ వెరిఫికేషన్ వంటి వాటితో పోలిస్తే ప్రస్తుతం చేపడుతున్న ఆధార్ తో కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వార సంస్థలకు పెద్ద ఎత్తున ఖర్చులు మిగులుతున్నాయి. దీంతోపాటు ఆధార్ ధ్రువీకరణ కేవైసీ సర్వీసులు ,కస్టమర్లతోపాటు సంస్థలకు ఈజిగా ఉంటున్నాయి. దీంతో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వాడుకునే అవకాశం ఇవ్వాలని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని ఆధికారిక వర్గాలు చెప్పాయి.నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత ఇన్ వాయిస్ జారీ చేసిన తర్వాత 15 రోజుల్లో ఈ లావాదీవీల ఛార్జీలను సంస్థలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమేంట్ 15 రోజులకు మించి ఆలస్యమైతే నెలకు 1.5 శాతం వడ్డీ చెల్లించాలి. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తే ప్రవేట్ సంస్థలు డబ్బులు చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కోంది..

ఆధార్ చార్జీలు కంపనీలు చెల్లిస్తాయా లేక వినియోగదారులా..
సాధరణంగా ఏ సంస్థలు కూడ లాభాపేక్ష లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవు, ఈనేపథ్యంలోనే ప్రవైట్ సంస్థలకు సర్వీసు అందించడం ఎంత అవసరం ఉందో అంతే అవసరం వినియోగదారికి కూడ ఉంటుంది..దీంతో మన గుర్తింపు కోసం మనమే డబ్బులు చెల్లించాలా లేక సర్వీసు అందిస్తున్న సంస్థలు చెల్లిస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications