ప్రముఖ శైవ క్షేత్రమైన కేదార్‌నాధ్ గుడిలోని కమిటీలో ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీని సభ్యుడిగా నియమిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ నిర్ణయం తీసుకున్నారు. తరచూ ఈ గుడిని సందర్శిస్తూ.. ఆలయ బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపధ్యంలో రావత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అంబానీ కుటుంబ సభ్యులతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రముఖ శైవక్షేత్రాన్ని సందర్శించిన ప్రతీసారీ తమ కుటుంబంలో ఏదో ఒక మంచి జరుగుతుందని ముకేష్ అంబానీ సభ్యులు భావిస్తూ ఉంటారు. అందుకే ఎవరో ఒకరు ఎప్పుడూ ఈ దేవాలయాన్ని వచ్చి ఆ పరమ శివుడి ఆశీస్సులూ పొందుతూ ఉండడం పరిపాటి.

ఇషా అంబానీ పెళ్లి నేపధ్యంలో గతేడాది కేదార్‌నాధ్ సందర్శించిన అంబానీ కుటుంబం అక్కడి పండితుల ఆశీస్సులు పొందారు.
ఉత్తరాఖండ్‌లోని మందాకినీ నది మధ్య హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కేదార్‌నాధ్ గుడి కొలువై ఉంది. అయితే ఎప్పుడు ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారుతాయో చెప్పడం కష్టం. అందుకే ఈ గుడి సందర్శన చాలా కష్టసాధ్యమైంది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య మాత్రమే భక్తులకు ఈ ఆలయ సందర్శన భాగ్యం ఉంటుంది. మిగిలిన సమయాల్లో మంచు కారణంగా ఈ ఆలయ దరిదాపుల్లోకి వెళ్లడం కూడా కష్టంగా ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications