కొడుకు పెళ్లికి పోలీసులకు భారీ గిఫ్ట్ ఇచ్చిన ముకేష్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, పరిచయం అక్కర్లేని వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి ముందు పోలీస్ శాఖకు భారీ కానుక ఇచ్చారు. ఏకంగా 50వేల మంది పోలీసులకు స్వీట్ బాక్సులను పంచిపెట్టారు.

ముంబైలో పనిచేస్తున్న ప్రతీ పోలీస్‌కూ స్వీట్ బాక్స్ అందేలా ఏర్పాటు చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్గాలు తెలిపాయి. మార్చి 9వ తేదీన జరగబోతున్న పెళ్లికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుక కోసం కార్పొరేట్ వర్గాలతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mukesh Ambani sent sweet boxes to 50K cops of mumbai, ahead of his sons wedding

స్వీట్ బాక్స్ స్పెషల్ పోలీసులు అందరికీ ఇచ్చిన స్వీట్ బాక్స్‌లో మిఠాయిలతో పాటు ముకేష్, నీతా, ఆకాశ్, శ్లోకా అంబానీల పేర్లతో ఓ చిన్న మెసేజ్ ఉంది. 'మీ ఆశీర్వాదం, మీ అభినందనలు మాపై ఎప్పటికీ ఉండాలి' అనే అర్థం వచ్చేలా మెసేజ్ ఉందని కొంత మంది పోలీసులు చెప్పారు. ముంబైలో ఎంతో మంది ప్రముఖుల పెళ్లిళ్లు అయ్యాయి కానీ ఇలా ఇంత మంది పోలీసులకు ఒకేసారి ఇన్ని స్వీట్ బాక్సులు పంపిణీ చేయడం ఎప్పుడూ జరగలేదని, తమను కూడా గుర్తుపెట్టుకుని వీటిని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పోలీస్ కానిస్టేబుల్స్ చెబ్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+