హెచ్ 1 బి వీసాలు 2018లో భారీ ఎత్తున రిజెక్ట్ అయ్యాయి. ట్రంప్ సర్కార్ వీసాలపై కఠినంగా ఉన్న నేపధ్యంలో గతేడాది ఎప్పుడూ లేనంతగా వీసాలను రద్దు చేసింది. వీటిల్లో ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలకు అధిక ప్రభావం ఉంది.
దేశవ్యాప్తంగా అనేక ఐటీ సంస్థలు హెచ్ 1 బి వీసాల సహకారంతో అమెరికాలో పనిచేసేందుకు తమ ఉద్యోగులను పంపిస్తూ ఉంటాయి. అయితే తమ దేశ పౌరులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి అక్కడ ఈ స్కిల్ సెట్ దొరకకపోతేనే విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకోవాలనే రూల్ ఎప్పటినుంచో ఉంది. అయితే భారతీయ ఐటి కంపెనీలు ఎక్కువగా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. ఇది ఆ దేశ పౌరుల ఉద్యోగులకు ఎసరుపెట్టడంతో డోనాల్డ్ ట్రంప్ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇది మన ఐటీ కంపెనీలనూ, డాలర్ డ్రీమ్స్ కంటున్న యువతపై ప్రభావాన్ని చూపిస్తోంది.

ఏ కంపెనీకి ఎంత ఎఫెక్ట్
2018 వీసాల మంజూరు - రద్దు లెక్కలు చూస్తే.. ఇన్ఫోసిస్ అత్యధికంగా ఇబ్బంది పడింది. 2042 మంది హెచ్ 1 బి వీసాలను యూఎస్ రిజెక్ట్ చేసింది. తర్వాత టీసీఎస్‌కు చెందిన 1744 వీసాలు రిజెక్ట్ అయ్యాయి. ఇదే బాటలో కాగ్నిజెంట్‌కు చెందిన 3548 వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ లెక్కలను సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ ప్రచురించింది.
టాప్ కంపెనీలకే ఎక్కువ ఎఫెక్ట్
ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్ సి ఎల్ టెక్ కంపెనీలకు చెందిన వీసాల్లో 2/3 వంతు రద్దు కావడం ప్రధాన చర్చగా మారింది. టాప్ కంపెనీల హెచ్ 1 బీలే రద్దైతే ఇక చిన్నవాటి గురించి ఆలోచించాల్సిన పనేలేదనే మాట వినిపిస్తోంది. భారత దేశానికి చెందిన మొత్తం 30 ఐటీ కంపెనీల 13,177 హెచ్ 1 బీలను అమెరికా తిరస్కరించింది. వీటిల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌వి మాత్రమే 7933 వీసాలు ఉన్నాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications