For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా

|

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా విధించింది.ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు.కాగా ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది.దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్‌ గత నవంబర్ లో నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100కోట్లను 24 గంటల్లో జమ చేయాలని ఆదేశించింది.

NGT Slaps Rs 500 Crore Penalty on Volkswagen for Cheating Emission Tests

ఈనేపథ్యంలోనే కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీరి నుంచి సిఫార్సులు తీసుకున్న అనంతరం.. పర్యావరణాన్ని కలుషితం చేసినందుకుగానూ ఫోక్స్‌వ్యాగన్‌కు రూ. 500కోట్ల జరిమానా విధిస్తూ నేడు తీర్పు వెల్లడించింది.

Read more about: volkswagen penalty
English summary

ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా | NGT Slaps Rs 500 Crore Penalty on Volkswagen for Cheating Emission Tests

The National Green Tribunal (NGT) has slammed a Rs 500 Crore penalty on Volkswagen forinstalling ‘Cheat Devices’ in their cars which helped the company cheat through emission tests. NGT has directed Volkswagen to pay the penalty in a matter of two months time.
Story first published: Thursday, March 7, 2019, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X