ప్రతి సంవత్సంర మార్చి ఏడున జన ఔషది దివస్ గా నిర్వహిస్తామని కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ సహయ మంత్రి మాందవియా అన్నారు.. జన ఔషధి కేంద్రాల్లో మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 15 లక్షల మంది ఈ కేంద్రాల్లో మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 800 రకాల ఔషధాలు, శస్త్రచికిత్సలకు ఉపయోగించే అన్ని రకాల పరికరాలు ఈ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. ఈనేపథ్యంలోనే వచ్చే సంవత్సరం నాటికి దేశంలో మరో 2500 జన ఔషది స్టోర్లను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది..కాగా దేశ వ్యాప్తంగా 5000 జన ఔషది స్టోర్స్ ఉన్నాయి..

ఈనేపథ్యంలోనే వీటిని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.కాగా ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని చోట్ల స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రజలంతా వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వీటిలో అన్ని రకాల మందులు అత్యంత తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి తమ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. వచ్చే ఆదాయంలో దాదాపు 70 శాతం మందులకే ఖర్చయిపోతున్న నేపథ్యంలో, ప్రజలందరికీ మందులు అందుబాటు ధరలో ఉంచుతున్నామన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications