అమెరికా.. ఇప్పటికీ.. ఎప్పటికీ మనభారతీయులకు హాట్ ఫెవరెట్ డెస్టినేషన్. ఎప్పుడెప్పుడు అమెరికాలో రెక్కలు కట్టుకుని వాలిపోదామా అనే డాలర్ డ్రీమ్స్‌లో బతికేస్తుంటారు మన వాళ్లు. అయితే రెండు, మూడేళ్లుగా ట్రంప్ దెబ్బకు మన వాళ్ల ఆశలన్నీ గల్లంతైపోతున్నాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న వాటికే ఎసరు పెడ్తున్నారు. దీంతో అందరి కంటే మనోళ్లే ఎక్కువ టెన్షన్ పడ్తున్నారు.

మూడున్నర కోట్లు పెట్టుబడి పెడితే ఆమేరికా వీసా ఇప్పిస్తామంటున్న ప్రైవేట్ ఈక్వీటీలు
అమెరికా.. ఇప్పటికీ.. ఎప్పటికీ మనభారతీయులకు హాట్ ఫెవరెట్ డెస్టినేషన్. ఎప్పుడెప్పుడు అమెరికాలో రెక్కలు కట్టుకుని వాలిపోదామా అనే డాలర్ డ్రీమ్స్‌లో బతికేస్తుంటారు మన వాళ్లు. అయితే రెండు, మూడేళ్లుగా ట్రంప్ దెబ్బకు మన వాళ్ల ఆశలన్నీ గల్లంతైపోతున్నాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న వాటికే ఎసరు పెడ్తున్నారు. దీంతో అందరి కంటే మనోళ్లే ఎక్కువ టెన్షన్ పడ్తున్నారు. దీన్నే ఓ అవకాశంగా తీసుకున్నాయి కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు. రూ.3.5 కోట్ల పెట్టుబడి పెడ్తే చాలు.. మీకో అద్భుతమైన ఆఫర్ రెడీ అంటూ ఊరించేస్తున్నాయి.

EB-5 వీసా
ఈబీ 5 వీసా అనే ప్రోగ్రాంను అమెరికా కాంగ్రెస్ 1990లో ప్రవేశపెట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, కొత్త పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగాలను రూపకల్పన చేసేందుకు అప్పట్లో ఆ దేశ ప్రభుత్వం ఈ స్కీం తీసుకొచ్చింది. దీని వల్ల ఎవరైనా తమ దేశంలో కొన్ని నిర్దిష్టమైన రంగాల్లో వాణిజ్యపరంగా 5 నుంచి 10 లక్షల డాలర్లను పెట్టుబడి పెట్టాలి. దీని వల్ల కనీసం 10 మంది అమెరికన్ పౌరులకు ఫుల్ టైం ఉద్యోగాలు రావాలి. ఈ నిబంధనల అన్నీ పాటిస్తే అప్పుడు సదరు ఇన్వెస్టర్‌కు రెండేళ్లలోపు కండిషనల్ రెసిడెంట్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. అందుకే చాలా మంది ఈ మార్గం ద్వారా అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ అయిపోయేందుకు చూస్తూ ఉంటారు.

మనోళ్లు వాడుకున్నారా
ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్లు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ప్రతీ ఏడాదీ 10000 ఈబీ-5 వీసాలు మాత్రమే ఇస్తుంది. ఏ ఒక్క దేశానికి కూడా తమ మొత్తం వీసాల్లో 7 శాతానికి మించి ఇవ్వరు. ఈ లెక్కన ఏటా 700 మంది భారతీయులకు మాత్రం ఈబీ-5 కింద వీసాలు పొందేందుకు అర్హత ఉంటుంది.
అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ స్కీం కింద జనాలు వెళ్తున్నారు. 2016లో 354 మంది, 2017లో 587 మంది భారతీయులు యూఎస్‌లో పెట్టుబడి పెట్టి అక్కడికి వెళ్లారు.

ట్రంప్ ఊరుకుంటున్నాడా
అమెరికాలో పెట్టుబడులు ఓకే కానీ... అక్కడికి వచ్చి సెటిల్ అయితే చూస్తూ ఊరుకుంటామా అనేది ట్రంప్ స్టైల్. అందుకే ఎప్పుడో 1990 లొ పెట్టిన నిబంధనను మార్చాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న 5 లక్షల డాలర్ల క్యాప్‌ను ఏకంగా 13.5 లక్షల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నారు. అదే గనుక జరిగితే పెట్టుబడి సుమారు రూ.9.5 కోట్ల వరకూ పెరిగిపోతుంది. అయితే ఇప్పటికిప్పుడు ట్రంప్ అలాంటి దుందుడుకు చర్యను చేపట్టకపోవచ్చని పెట్టుబడి వర్గాలు భావిస్తున్నాయి. సో.. హెచ్ 1 బి వీసాలు రాక, ఎలా అయినా యూఎస్‌లో సెటిల్ కావాలని అనుకునే వాళ్లకు ఇప్పుడిదో బెస్ట్ ఆప్షన్. అయితే ఈ వీసా కోసం ఎంపిక చేసుకునే కంపెనీలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లు చేతులెత్తేస్తే డబ్బూ పోతుంది, వీసా పోతుంది.. అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications