దేశంలో ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ సంస్థ పిఎన్‌బి మెట్ లైఫ్ త్వరలో నిధుల సమీకరణ కోసం స్టాక్ మార్కెట్లోకి వస్తోంది. ఐపీఓ ద్వారా సుమారు రూ్.2300 కోట్లను సమకరించాలని చూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ఐపీఓకు రావొచ్చని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అప్పుడు ఐపీఓకు వస్తే మంచి రెస్పాన్స్ ఉంటుందని భావిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అనిశ్చిత తరుణంలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు అంతగా మొగ్గుచూపరు అని ఈ ఇన్సూరెన్స్ సంస్థ లెక్కలుగడ్తోంది.
జూన్ తర్వాతే
జూన్ లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరడం కష్టమైన పని. ఎందుకంటే ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చినా ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాతే ఐపీఓ రావొచ్చు. అయితే ఈలోపు ప్రక్రియనంతా పూర్తి చేసుకుంది పిఎన్‌బి మెట్‌లైఫ్. సెబీకి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసినట్టు యాజమాన్యం వెల్లడించింది.

వేల్యుయేషన్ ఎంత
మార్కెట్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం పీఎన్‌బి మెట్‌లైఫ్‌కు రూ.11000 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కట్టారు. దీని ప్రకారమే సుమారు రూ.2300 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించబోతున్నారు. ఇప్పుడున్న ఈక్విటీలో 25 శాతాన్ని అమ్మకానికి పెట్టబోతున్నారు. ప్రస్తుంత పిఎన్‌బి మెట్‌లైఫ్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 30 శాతం, మెట్ లైఫ్‌కు 26 శాతం, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్‌కు 21 శాతం, ఎం పల్లోంజి అండ్ కంపెనీకి 18 శాతం, జమ్ము-కశ్మీర్ బ్యాంక్‌కు 5 శాతం వాటాలున్నాయి.
ఇప్పటికే ఇన్సూరెన్స్ రంగానికి చెందిన నాలుగు సంస్థలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. వాటిల్లో ఐసిఐసిఐ ప్రూ లైఫ్, హెచ్ డి ఎఫ్ సి లైఫ్, ఎస్.బి.ఐ. లైఫ్ ఉన్నాయి. నాన్ లైఫ్ విభాగంలో ఐసిఐసిఐ లంబార్డ్, జీఐసి సంస్థలున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications