ఇండియాలో పెరుగుతున్న ఆన్ లైన్ గేమీంగ్ యూజర్లు, 2023 నాటికి పదికోట్ట యూజర్లు పేరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి నివేదికలు..ప్రధానంగా మొబైల్ వాడకం పెరగడం తోపాటు పలు పలు అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి..

దేశంలో పెరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్ యూజర్ల సంఖ్య
ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ యూజరర్ల సంఖ్య శర వేగంగా పెరుగుతుంది .దేశంలో ఈ సంఖ్య 2023 నాటికి సుమారు 12 వేల కోట్లకు చేరనుందని నివేదికలు చెబుతున్నాయి.ఆన్ లైన్ గేమ్ యూజర్లు, 2014లో కేవలం రెండు వేల కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమ్ యూజర్లు, 2018 నాటికి సుమారు 4,500 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరింది. కాగా 2018- 23 నాటికి 12వేల కోట్ల చేరుకోనుందని ఇండియన్ ఫెడరేషన్ స్పోర్ట్స్ గేమింగ్ రిపోర్టు వెల్లడించింది. ఇండియాలో ఆన్లైన్ గేమ్స్ ఆటగాళ్ళ సంఖ్య 2010 లో రెండు కోట్ల నుండి 2018 నాటికి 5 కోట్లకు పెరిగింది. ఆన్లైన్ గేమింగ్ లో రెవెన్యూ పరంగా మొబైల్ ఫోన్స్ వాటా అత్యధిక ఉంది.2017 లో గేమింగ్ రెవెన్యూ మొబైల్ విభాగం 80 శాతంగా నమోదయింది.స్మార్ట్ ఫోన్ వాడే సామర్థ్యం పెరగడంతోపాటు ఇంటర్నెట్ యూజర్ల పెరగడం ప్రధాన కారణాలు. ఇందులో ఫజిల్ , యాక్షన్, అడ్వంచర్ గేమ్స్ ను బాగా ఆడుతున్నట్టు రిపోర్ట్ తెలిపింది.

ఫాంటసీ స్పోర్ట్స్ ఊపందుకుంటున్నాయి,
దేశంలో ఫాంటసీ స్పోర్ట్స్ కూడా ఊపందుకుంటాయని ప్రత్యేకంగా ప్రస్తావించింది. డిజిటల్ ఇన్ఫాస్ట్ర్రక్చర్ ఎదుగుదలకు, కొత్త స్పోర్ట్ర్స్ లీగ్స్ తోడవడమే దానికి కారణమని విశ్లేషించింది. ఇండియాలో ఫాంటసీ స్పోర్ట్స్ ఆపరేటర్ ల సంఖ్య 2016 లోని 10 నుంచి ఏడు రెట్లు పెరిగి 2018 నాటికి 70 కి చేరిందని రిపోర్ట్ తెలిపింది. ఇదే సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ యూజర్లు భారీగా పెరిగాయని పేర్కొంది .2016లో ఫాంటసీ స్పోర్ట్ర్స్ యూజర్ల సంఖ్య 20 లక్షల కాగా 2019 ఫిబ్రవరి నాటికి అది ఏకంగా ఐదు రెట్లు పెరిగింది 5 కోట్లకు చేరిందని వెల్లడించింది.

చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా ఆడుతున్నారు
సర్వే చేసిన 336 మందిలో 74% మంది యూజర్లు వారంలో 13 సార్లు ఫాంటసీ గేమ్స్ అడతామని మిగతా వారు వారానికి ఒక్కసారి అడతామని తెలిపారని పేర్కోంది.కాగా చిన్న పట్టణాల్లో నాలుగుసార్లు అడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని చిన్న పట్టణాల్లో వారితో పోలిస్తే పెద్ద నగరాలలోని వారు గేమ్స్ తక్కువగా ఆడుతున్నారని చెప్పింది.సర్వేలో పాల్గొన్న యూజర్లలో ఇరవై ఒక్క శాతం మంది ఫాంటసీ క్రికెట్, 54 శాతం మంది ఫుట్ బాల్ అడుతున్నారని, దేశంలో క్రికెట్ యెతర ఆటల లీగ్స్ పెరుగుతున్నాయని కూడా వివరించింది 2020 నాటికి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్స్ యూజర్ల సంఖ్య పది కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఏ పీ ఎం జి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications