అంతర్జాతీయ మహీళ దినోత్సం సంధర్భంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్చి 7, 8 తేదీల్లో భారీ డిస్కౌండ్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా హానర్ 9ఎన్, నోకియా 6.1 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, వివో వి9 ప్రో, మోటో వన్ పవర్ మోడళ్లపై డిస్కౌంట్లు అందించనుంది. వీటిపై ప్రస్థుత ధర కన్న రెండు వేల రుపాయలను తగ్గించనుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన లాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. దీంతోపాటు ఫర్నిచర్ పై 40 నుండి 80 శాతం , టీవీలు, ఫ్యాషన్ పై 40 నుండి 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తుంది.

కాగా జెన్‌ఫోన్ లైట్ ఎల్1 అత్యధికంగా రూ. 4,999 డిస్కౌంట్‌పై లభించనుంది. రూ. 71,000గా ఉన్న 64 జీబీ గూగుల్ పిక్సెల్ 3 విమెన్స్ డే సేల్‌లో భాగంగా రూ.59,999 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌తో రూ. 2,999 నుంచి, ల్యాప్‌టాప్స్ రూ.12,990 నుంచి లభించనున్నాయి. అంతేకాకుండా ఈ సేల్ జరుగుతున్న రెండు రోజులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి బ్లాక్‌బస్టర్ డీల్స్, ప్రతి గంటకొకసారి ఓమైగాడ్ డీల్స్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications