టాటా సన్స్. టాటా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన మాతృ సంస్థ. ప్రస్తుతం దీని విలువ సుమారు 104 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చూస్తే సుమారు రూ.7.50 లక్షల కోట్లు. 1000 కంపెనీలు.. వందల విభాగాలు.. లక్షలాది ఉద్యోగులతో టాటా గ్రూపు సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఐటి, స్టీల్, ఆటో, టెలికాం, ట్రావెల్, టూరిజం సహా.. వివిధ విభాగాలు ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగాయి. అయితే ఇన్ని సంస్థలను మానిటర్ చేయడం, వాటిని ఏకీకృతం చేసి సినర్జీని వాడుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ఇప్పటివరకూ ఎవరూ చూడని భారీ ఎక్సర్‌సైజ్‌ను చేపట్టింది టాటా సన్స్.

10 విభాగాల్లోనే... 1000 కంపెనీలు
ప్రస్తుతం టాటా సన్స్ ఉప్పు నుంచి విమానాల తయారీ వరకూ వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయింది. అయితే ఒకేతరహా వ్యాపారం ఉండి వేర్వేరు సంస్థలుగా ఉన్నవాటన్నింటినీ ఒక వెర్టికల్ కిందికి తీసుకురావాలని ఛైర్మన్ చంద్రశేఖరన్ నిర్ణయించారు. సింప్లిఫై, సినర్జీ, స్కేల్ అనే మాటను ఆయన ఇప్పుడు తరచూ ఉపయోగిస్తున్నారు. అందుకే 10 విభాగాలుగా మొత్తం సంస్థలను విడగొట్టి వాటికి హెడ్స్‌ను కోఆర్డినేటర్స్‌గా నియమించబోతున్నారు.

ఏ విభాగంలో ఏది
ఐటీలో టాటా కన్సల్టెన్సీ, టాటా ఎలక్సి ఉన్నాయి.
- - స్టీల్ విభాగంలో టాటా స్టీల్
- - ఆటోమోటివ్‌లో టాటా మోటార్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్, టాటా ఆటో కాంప్ సిస్టమ్స్
- - కన్స్యూమర్ రిటైల్ - టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, వోల్టాస్, టైటాన్, ఇన్ఫినిటీ , ట్రెంట్
- - ఇన్ఫ్రాస్ట్రక్చర్ - టాటా పవర్, టాటా హౌసింగ్, టాటా కన్సల్టింగ్, టాటా రియాల్టీ, టాటా ప్రాజెక్ట్స్
- - ఫైనాన్షియల్ సర్వీసెస్ - టాటా క్యాపిటల్, టాటా అసెంట్ మేనేజ్మెంట్, టాటా ఏఐజీ, టాటా ఏఐఏ లైఫ్
- - ఏరోస్పేస్, డిఫెన్స్‌లో టాటా ఎడ్వాన్స్డ్ సిస్టమ్
- - ట్రావెల్ - ఇండియన్ హోటల్స్, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా
- - టెలికాం - టాటా కమ్యూనికేషన్స్, టాటా స్కై, టాటా టెలీ
- - ట్రేడింగ్ - టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇండస్ట్రీస్, టాటా ఇంటర్నేషనల్.

ఖర్చుల నియంత్రణ కోసం
ప్రస్తుతం టాటా గ్రూపులో సుమారు 100 ఆపరేటింగ్ కంపెనీలు ఉన్నాయి. వీటికి 1000 సబ్సిడరీసంస్థలున్నాయి. వాటిల్లో 30 సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. తాజాగా 10 విభాగాలుగా మొత్తం వ్యాపారాన్ని విభజించడం వల్ల ఏ సంస్థలో ఏం జరుగుతోందో తెలుసుకోవడంతోపాటు గ్రూపు సంస్థల మధ్య సమన్వయానికి తోడ్పడ్తుంది. ఖర్చులు నియంత్రణంలో ఉంచుకుని లాభాలను పెంచుకునేందుకు ఇది దోహదపడ్తుందనే విషయాన్ని టాటా సన్స్ పదే పదే చెబ్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications