రానుంది ఎలక్ట్ర్ర్రిక్ వాహానాల కాలమేనా ..అవే మన ప్రయాణంలో కీలక పాత్ర పోషించనున్నాయా.. ఈవీలు వినియోగానికి ముందుకు రావాలంటే ఈ రిక్షాలను ముందుగా మార్కేట్ లోకి తీసుకురావాలా.. అందుకే ప్రభుత్వం ఈ రిక్షాల తయారీ ప్రోత్సహిస్తుందా అంటే అవునని చెబుతున్నాయి పలు నివేదికలు...
ఎలక్ట్ర్ర్రిక్ వాహానల వినియోగం పెంచడంలో విద్యుత్ త్రీ వీలర్లు కీలక పాత్ర పోషించనున్నట్టు డెలాయిట్ తాజా నివేదిక చెబుతోంది. ప్రభుత్వం యొక్క పర్పస్ తీరాలంటే ఎక్కువగా ఈ రిక్షాల తయారి మేలని చెబుతుంది..ఈ రిక్షాలు పట్టణ ప్రాంతాల్లో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటిని కలిగి ఉంటాయని నివేదిక పేర్కోంది.కాగా విద్యుత్ వాహానాలు ఇండియాలో విజయవంతం కావాలంటే వాటికి అనుకూలమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసే భాద్యత ప్రభుత్వానిదని తెలిపింది.వీటికి సంబందించి రిస్కులు పడాల్సిన అవసరం లేదని పేర్కోంది.అయితే ఈ-రిక్షాలు విజయవంతం కావాలంటే ప్రభుత్వం, వాహన, బ్యాటరీల తయారీదారులు, ప్రైవేటు ఆపరేటర్లు అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని పేర్కోంది.
ఈ వాహనాల కొనుగోళ్లు, వినియోగం, పర్యవేక్షణ, నియంత్రణవంటివి ప్రభావవంతంగా ఉండేలా వ్యాపార నమూనాలు ఉండాలని పేర్కొంది. ఇలా ఉంటేనే నగరాల్లో విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. విద్యుత్ వాహనాల వినియోగం పెరగడంతో ప్రభుత్వ పాత్ర చాలా ముఖ్యమని నియంత్రణా విధానం తీసుకురావడంలోనే కాకుండా బ్యాటరీల వ్యయం తగ్గడంలో, చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వ మద్దతు అవసరం ఉంటుందని పేర్కొంది.

విద్యుత్ వాహనాలకు ఫేమ్-2 దన్ను
ఫేమ్-2 పథకం కింద రూ.10,000 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని విద్యుత్ వాహనాలు విడుదల చేయడానికి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్యాసెంజర్ వాహన విభాగంలో ఈ2ఓప్లస్, ఈవెరిటో పేర్లతో విద్యుత్ వాహనాలను విక్రయిస్తోంది. ఈ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో ఎలక్ర్టిక్ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్యను పెంచే చర్యల్లో భాగంగా చకన్ (పుణే)లోని ప్లాంట్‌ను రూ.450 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తోంది.


Click it and Unblock the Notifications