లక్ష్యాన్ని చేరుకోని ముద్ర బ్యాంకు రుణాలు ...
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముద్ర పథకం లక్ష్యాన్ని చేరుకోలేదు..ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 10వేల 759 కోట్లు ముద్ర పథకం క్రింద మంజూరు చేయగా, బ్యాంకులు మాత్రం 2 లక్షల 2 వేల 668 కోట్ల రుపాయలను అప్పుగా ఇచ్చాయి. ఇంకా ఈ పథకం నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాడానికి మార్చి 31 వరకు 'సమయం ఉండగా ఇప్పటి వరకు ఇంకా సుమారు లక్ష కోట్ల రుపాయలను మంజూరు చేయాల్సి ఉంది..
కేంద్రం మాత్రం 2018 ,19 ఆర్దిక సంవత్సరానికి మూడు లక్షల కోట్లను ముద్ర పథకం క్రింద రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.కాని మరో నెలరోజులుండగా సుమారు రెండు లక్షల కోట్లను మాత్రమే రుణాలుగా అందించింది..అయితే కాగా మరో నెల రోజుల్లో లక్ష కోట్లను ఇచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు..ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం సుమారు రెండున్నర లక్షల కోట్ల రుపాయలను ఈ పథకం క్రింద రుణాలను అందించారు.కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పటికి లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు...

చిన్న , సన్నకారు పరిశ్రమలతోపాటు వాణిజ్యపరం కాని పరిశ్రమలకు ఈ పథకం క్రింద చేయూత నివ్వాలని నిర్ణయించింది.ఇందులో భాగంగానే 2015 ఏప్రిల్ 8 న కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కాగా 2019 ,-20 ఆర్ధిక సంవత్సరంలో ముద్ర పథకం ద్వార మొత్తం నాలుగు సంవత్సరాల్లో 15. 56 కోట్ల మందికి గాను రూ. ఏడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రుపాయల రుణాలిచ్చినట్టు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు..కాగా ఇందులో ఎక్కవ మంది మహిళలే ఉన్నట్టు చెప్పారు.