ఈపీఎఫ్ పింఛనుదారులకు గుడ్ న్యూస్ .. ఇకపై రూ.2 వేల కనీస్ పింఛన్
న్యూఢిల్లీ : ఈపీఎఫ్ పింఛనర్లకు గుడ్ న్యూస్. ఇకపై వారి కనీస పింఛన్ రూ.2 వేలకు పెంచేందుకు ఈపీఎఫ్ వో కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈపీఎఫ్ వో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక రూపొందిచింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది. ఇటీవల జరిగిన ఈఫీఎఫ్ వో ట్రస్టీల సమావేశంలో కనీస పింఛన్ పెంపు విషయంపై అధికారికంగా నిర్ణయం వెలువడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది.

కనీస పింఛన్ రూ.6 వేలు
తమ కనీస పింఛన్ రూ.6 వేలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రతిపాదనను పింఛను అమలు కమిటీ తిరస్కరించింది. పింఛనుదారులకు డీఏ చెల్లించడం కుదరదని ప్రతిపాదించింది. మరోవైపు ఈపీఎఫ్ 95 పథకంలో మరిన్ని మార్పులు చేసేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. రూ.2 వేల కనీస పింఛను పై వచ్చే సీబీటీ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు ఈపీఎఫ్ వో వర్గాలు పేర్కొన్నాయి. కనీసం పింఛను రూ. 2 వేలకు పెంచాలని భావిస్తోన్న తరుణంలో మరిన్ని సంస్కరణలను ఈపీఎఫ్ వో పరిశీలిస్తోంది. నిర్వహణ భారం పెరగనుండటంతో అదనపు పింఛను మొత్తాన్ని కేంద్రం బడ్జెట్ ద్వారా ఇవ్వాలని ఉన్నత స్థాయి కమిటీ సూచించింది. అదే సమయంలో వేతన పరిమితిని రూ. 15 వల నుంచి రూ.25 వేలు పెంచే అవకాశం ఉంది. ఈపీఎఫ్ చందాదారుడిగా చేరిన కార్మికుడు, ఉద్యోగి సర్వీసు పదేళ్లలోపు ఉంటే ఈపీఎఫ్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉండేది. కొత్త సంస్కరణ అమల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించేందుకు ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పలు సంస్కరణలతో కేంద్ర మంత్రివర్గానికి సమర్పించింది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత పూర్తి నివేదిక వివరాలు వెల్లడవుతాయి.

నెలవారీ కనీస చందా ఏంతంటే ..
ఉద్యోగి వేతనం 12 శాతం యజమాని తన వంతు వాటాగా చెల్లిస్తారు. ఇందులో 8.33 శాతం (గరిష్టంగా రూ.1250) ఈపీఎఫ్ లో జమవుతోంది. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో వేస్తారు. ఉద్యోగి వేతనం ప్రకారం ఈపీఎఫ్ లో జమయ్యే నెలవారీ చందా వేర్వేరుగా ఉంటుంది. అలా కాక ప్రతి ఒక్కరి నుంచి నెలవారీ కనీస ఈపీఎఫ్ చందా వసూల్ చేస్తూ పింఛను నిధి లోటును భర్తీ చేసుకోవాలన్న ఆలోచనలో ఈపీఎఫ్ వో ఉంది. కొందరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పింఛను లెక్కింపు వేతన కాలపరిమితి తగ్గించాలని కోరగా .. ఇప్పటికే లోటు ఉన్నందున కుదరదని ఈపీఎఫ్ వో స్పష్టంచేసింది.

అలా కాదు .. ఎలా అంటే ..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గతంలో ఈపీఎఫ్ పింఛనుదారులకు కరవుభత్యాన్ని ఈపీఎఫ్ వో చెల్లించింది. 1996 నుంచి 2000 సంవత్సరం వరకు ఏటా 4 నుంచి 5 శాతం వరకు ఇచ్చింది. తర్వాత ఈ విషయాన్ని విస్మరించింది. పింఛను నిధి లోటు నేపథ్యంలో ధరల సూచీ మేరకు డీఏ ఇవ్వడం కుదరదని తెలిపింది.

బేసిక్ లో భాగమే ప్రత్యేక అలవెన్స్
మరోవైపు ప్రత్యేక అలవెన్స్ గా చూపుతున్న మొత్తాన్ని ఉద్యోగుల బేసిక్ లో భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఈపీఎఫ్ వో స్పందించింది. ఈపీఎఫ్ బకాయిలు లెక్కింపులో దీనిని పరిగణనలోకి తీసుకొని సంస్థలపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం ఉద్యోగితోపాటు యాజమాన్యాలు కూడా బేసిక్ లో 12 శాతాన్ని ఈపీఎఫ్ వో కు జమ చేస్తోంది.


Click it and Unblock the Notifications