న్యూఢిల్లీ : సెబీ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారు. బడ్జెట్ తర్వాత మార్కెట్ నియంత్రణాధికార సంస్థ (సెబీ) ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాధారణం. ఇటీవల సెబీ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ప్రసంసించారు జైట్లీ

నిబంధనల సరళీకరణ
స్టాక్ మార్కెట్ లో నమోదు కావాలని భావిస్తోన్న అంకురాలకు ప్రోత్సహాన్నివ్వాలని సెబీ భావించింది. అందులోభాగంగా అంకురాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడుదార్ల గుర్తింపు నిబంధనలను సరళీకరించడానికి సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంకురాల నమోదుకు ఉద్దేశించిన ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ ఫాం నుంచి గుర్తింపు పొందే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు, అర్షత, ఇతర నిబంధనలను సెబీ త్వరలో నోటీఫై చేస్తోంది.

చార్జీల తగ్గింపుతో రిలీఫ్
బ్రోకర్లకు, స్టాక్ ఎక్సేంజీలు, నమోదయ్యే కంపెనీలకు ఛార్జీలను తగ్గించడానికి సెబీ బోర్డు అనుమతిచ్చింది. అదే సమయంలో రుణ పునర్నిర్మాణాన్ని ఎదుర్కొంటున్న కంపెనీలకు నిబంధనలను సరళీకరించడానికి అంగీకరించింది. ఎంపికచేసిన కంపెనీలకు ఓపెన్ ఆఫర్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది.

నమోదు నిబంధనల సరళీకరణ
స్థిరాస్తి, మౌలిక పెట్టుబడుల ట్రస్టుల నమోదుకు నిబంధనల సరళీకరణకు ఆమోదం తెలిపింది. కస్టోడియన్లు, సెబీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ ను పొందే వెసులుబాటును కల్పించింది.

ఫండ్ లకు కమోడిటీ డెరివేటిట్ మార్కెట్ లో పర్మిషన్
కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ ను మరింత విసృతం చేసేందు కోసం మ్యూచువల్ ఫండ్, ఫోర్ట్ పోలియో మేనేజర్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ లకూ కమోడిటీ డెరివేటివ్స్ లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే తాజాగా వాటికి కాంట్రాక్టుల భౌతిక సెటిల్ మెంట్ కు బదులుగా వస్తువుల డెలివరీ తీసుకునేందుకు సెబీ అనుమతులిచ్చింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications