For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు నెలల తరువాత పెరిగిన ఎల్పిజి సిలిండర్ ధరలు.

By bharath
|

శుక్రవారం నాడు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి.వరుసగా మూడు నెలల ధరలు తగ్గింపు తరువాత మొదటిసారి పెరిగింది. ఢిల్లీలో సబ్సిడైజ్డ్ ఎల్పిజి మార్చిలో సిలిండర్ కు రూ. 2.08 రూపాయల చొప్పున, నాన్ సబ్సిడైజ్డ్ వంటగ్యాస్ రేటు సిలిండర్కు రూ. 42.50 రూపాయల చొప్పున పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించింది. జాతీయ రాజధానిలో సబ్సిడైజ్డ్ మరియు నాన్ సబ్సిడెడ్ ఎల్పిజి రేట్లు సిలిండర్ కు రూ. 495.61 రూపాయలు మరియు రూ.701.50 రూపాయల ధరలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ తెలిపింది.

గడచిన మూడు నెలల్లో

గడచిన మూడు నెలల్లో

గడచిన మూడు నెలల్లో ఎల్పిజి ధరల తగ్గింపు తరువాత గురువారం ధరలు పెరిగిపోయాయి.తాజా పెంపునకు ముందు సబ్సిడీ వంటగ్యాస్ ధరలు దాదాపు నవంబర్ నుండి ఢిల్లీలో సిలిండర్ కు రూ.13.89 రూపాయలు తగ్గింది అని ఇండియన్ ఆయిల్ నుండి డేటా చూపించింది.నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి రేట్లు ఇదే సమయంలో సిలిండర్కు రూ. 283.5 రూపాయల చొప్పున తగియింది.

ఢిల్లీలో సిలిండర్ ధర

ఢిల్లీలో సిలిండర్ ధర

ఫిబ్రవరిలో ఢిల్లీలో సబ్సిడీ,నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 493.53 మరియు రూ. 659.00 రూపాయలు.అంతర్జాతీయ ధరల మార్పు, విదేశీ మారక ద్రవ్యం అస్థిర మార్పులకు జాతీయ రాజధానిలో సబ్సిడీ రేట్లను పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. "సబ్సిడెడ్ ఎల్పిజి కస్టమర్లు కేవలం సిలిండర్కు రూ. 2.08 మాత్రమే అదనంగా చెల్లించాలి అని పేర్కొంది.

ముంబైలో సిలిండర్ ధర

ముంబైలో సిలిండర్ ధర

ముంబైలో సబ్సిడైజ్డ్,నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 493.32 మరియు రూ.673.50 రూపాయలు అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ iocl.com లో తెలిపింది.

వినియోగదారుల బ్యాంకు ఖాతాలో

వినియోగదారుల బ్యాంకు ఖాతాలో

2019 మార్చి నాటికి వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ బదిలీ రూ.209.89 రూపాయలకు పెరిగింది. 2019 ఫిబ్రవరి నాటికి సిలిండర్కు 165.47 రూపాయల నుంచి పెరిగింది.ప్రస్తుతం, దేశంలో LPG వినియోగదారులు మార్కెట్ ధర వద్ద ఇంధన కొనుగోలు చేయాలి. అయితే, వినియోగదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 14.2 కిలోల ప్రతి ఇంటికి 12 సిలిండర్లను సబ్సిడీ చేస్తుంది.

 LPG రేటు

LPG రేటు

సగటు సరాసరి బెంచ్మార్క్ LPG రేటు మరియు విదేశీ మారకం రేటులో మార్పుల ఆధారంగా ఈ సబ్సిడీ మొత్తం నెల నుండి నెలకు మారుతూ ఉంటుంది.

పన్ను నిబంధనల ప్రకారం, LPG పై వస్తువుల మరియు సేవల పన్ను (GST) మార్కెట్ రేట్లు వద్ద లెక్కించబడుతుంది.

అయితే మార్కెట్ ధరలలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ధరలో కొంత భాగాన్ని సబ్సిడీగా ఎంచుకోవచ్చు.

Read more about: lpg indian oil
English summary

LPG Cylinder Becomes Costlier After Three Months Of Rate Cuts.

LPG prices were increased on Friday, marking the first upwards revision after three straight monthly cuts. In Delhi, while the subsidised LPG will cost Rs. 2.08 per cylinder more in March, non-subsidised LPG rate prices have been increased by Rs. 42.50 per cylinder, according to Indian Oil Corporation.
Story first published: Friday, March 1, 2019, 13:20 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more