దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.
ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ధరల పెరుగుదల వరుసగా ఆరు రోజుల తర్వాత బుధవారం స్థిరంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ధరల పెరుగుదల వరుసగా ఆరు రోజుల తర్వాత బుధవారం స్థిరంగా ఉన్నాయి.నేటి దరల పెరుగుదల అనంతరం లీటర్ పెట్రోల్ పై 6-7 పైసలు పెరిగి, డీజిల్ పై లీటరుకు 8 పైసలు పెరిగింది.

ఢిల్లీలో పెట్రోలు ధర బుధవారం 71.66 రూపాయలు ఉండగా నేడు రూ.71.73 రూపాయలకు చేరింది అలాగే డీజిల్ ధర బుధవారం రూ .67.92 గా ఉండగా నేడు ధర 67 రూపాయలకు పెరిగింది.
చెన్నైలో పెట్రోలు లీటర్కు రూ.74.48 రూపాయలు చెల్లించాల్సి ఉంది. బుధవారం నాటి ధరతో పోల్చి చూస్తే 7 పైసలు పెరిగింది. లీటరు డీజిల్ ధర రూ. 70.80 రూపాయలకు చేరింది.
అదేవిధంగా ముంబైలో పెట్రోలు ధర 7 పైసలు పెరిగి రూ.77.36 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధరలు కూడా లీటరుకు 8 పైసలు పెరిగి రూ. 70.10 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోలు ధర రూ.73.82 రూపాయలు, డీజిల్ ధర 8 పైసలు పెరిగి రూ.68.79 రూపాయలకు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
నోయిడాలో పెట్రోలు పై ధర 5 పైసలు పెరిగి రూ.71.35 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 66.03 రూపాయలకు పెరిగింది. గురుగ్రాంలో గురువారం పెట్రోల్ రూ.72.08 రూపాయలు, బుధవారం 72.04 రూపాయల ధర ఉంది అలాగే డీజిల్ రూ.66.29 రూపాయల నుండి పెరిగి రూ.66.33 రూపాయలకు చేరుకుంది.
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటుపై ఆధారపడుతున్నాయి.భరత్ లో ముడి అవసరాలకు 80 శాతం దిగుమతి చేస్తోంది.
అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 66.23 డాలర్లు, వరుసగా 16 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications