రెండో రోజూ నష్టాల్లోనే ముగింపు ! పాక్ దాడుల ఎఫెక్ట్

భారతీయ స్టాక్ మార్కెట్‌లో మళ్లీ కలవరం మొదలైంది. రేపు ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ కూడా ఉన్న నేపధ్యంలో ఒడిదుడుకులు తీవ్రమయ్యాయి. భారత గగనతలంలోకి పాక్ వాయుసేన అడుగుపెట్టి మన దేశానికి చెందిన ఒక మిగ్ విమానాన్ని కూల్చివేసింది. ప్రతిగా మన ఎయిర్‌ఫోర్స్ కూడా పాక్‌కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ప్రకటించింది. ఈ వార్తల నేపధ్యంలో మన స్టాక్ మార్కెట్ సూచీలు కంగారుపడ్డాయి. యుద్ధవాతావరణం లేకపోయినా టెన్షన్స్ పెరిగిపోవడంతో సెనెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 600 పాయింట్లు కోల్పోయింది. ఆద్యంతం ఒడిదుకుడుల మధ్య సాగిన మార్కెట్ సూచీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 41 పాయింట్లు, సెన్సెక్స్ 68 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

ఉదయం స్థిరంగా 50 పాయింట్ల లాభంతో 10881 దగ్గర మొదలైన నిఫ్టీ ఒక దశలో పటిష్ట స్థాయికి చేరి 10940 వరకూ చేరింది. అయితే పదకొండు గంటల సమయంలో రెండు దేశాల మధ్య వాతావరణం వేడెక్కడంలో మార్కెట్ సూచీలు లాభం నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 10751 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివర్లో 50 పాయింట్ల వరకూ రికవర్ అయి 10806 దగ్గర నిఫ్టీ లోజైంది. ఆటో, ఫార్మా, రియాల్టీ రంగ కౌంటర్లలో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు నమోదైంది. బ్యాంకింగ్, మీడియా, ఐటి, ప్రైవేట్ బ్యాంక్ కౌంటర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ పావు శాతానికిపైగా లాభాలతో ముగిశాయి.

stock market indexes are worse in the backdrop of this news.

రెయిన్ రెయిన్.. గోయింగ్ అవే
హైదరాబాద్‌కు చెందిన పెట్ కోక్, సిమెంట్ సంస్థ రెయిన్ ఇండస్ట్రీస్ షేర్ భారీగా పతనమైంది. నిరుత్సాహక త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో స్టాక్ 10 శాతం నష్టపోయింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ మూడు రెట్లు పెరిగాయి. ఆదాయంలో 9.5 శాతం వృద్ధిని నమోదు చేసిన సంస్థ ఏకంగా రూ.139 కోట్ల నికర నష్టాన్ని చూపించింది. ఎబిటా మార్జిన్లు 22 శాతం నుంచి 3 శాతానికి తగ్గాయి. దీనికి తోడు సంస్థ ఎండి జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎన్.రాధాక్రిష్ణారెడ్డి ఎండిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మార్చి 2019 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
ఈ వార్తల కారణంగా స్టాక్ 9.7 శాతం నష్టపోయి రూ.97.90 దగ్గర క్లోజైంది.

మ్యాక్స్ ఇండియా
మ్యాక్స్ ఇండియా స్టాక్ వరుస ఆరు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ సుమారు 15 శాతం వరకూ నష్టపోయింది. మ్యాక్స్ బూపా సంస్థలో తనకు ఉన్న 51 శాతం వాటాను ట్రూ నార్త్ ఫండ్‌కు రూ.511 కోట్లకు అమ్మేసింది. దీన్ని మార్కెట్ వర్గాలు పాజిటివ్‌గా తీసుకోలేదు. చివరకు స్టాక్ 13.52 శాతం నష్టంతో రూ.71.35 దగ్గర క్లోజైంది.

stock market indexes are worse in the backdrop of this news.

మిందా కార్ప్ జంప్
ప్రముఖ ఆటో యాన్సిలరీ సంస్థ మిందా కార్ప్ స్టాక్ నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ రోజు కూడా స్టాక్ 10 శాతానికిపైగా లాభపడింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 15 రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ రూ.138 దగ్గర క్లోజైంది.

పీసీఏ ఔట్ ఎఫెక్ట్
ఆర్థిక స్థితిగతులు కొద్దిగా మెరుగైనందుకు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్‌ను ఆర్బీఐ తొలగించింది. దీంతో ఈ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. అలహాబాద్ బ్యాంక్,కార్పొరేషన్ బ్యాంక్ స్టాక్స్ 5 శాతానికి పైగా లాభపడితే, ధనలక్ష్మి బ్యాంక్ 12 శాతం పెరిగింది.

మిడ్ క్యాప్స్ జోరు
మార్కెట్ వీక్‌గా ఉన్నా.. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో జోరు మాత్రం కొనసాగింది. సద్భావ్ ఇన్ఫ్రా 19 శాతం, భారత్ డైనమిక్స్ 15 శాతం, లక్ష్మీవిలాస్ బ్యాంక్, లిండే ఇండియా, మెర్క్, డిఎఫ్ఎం పుడ్స్ 8 శాతం వరకూ పెరిగాయి. ఇదే బాటలో ఫైనోటెక్స్ కెమికల్స్ 6 శాతం, ఎన్ సి ఎల్ ఇండస్ట్రీస్, డెక్కన్ సిమెంట్స్ 5 శాతం లాభపడ్డాయి.

విప్రో వీక్
ఐటి ప్యాక్ కొద్దికాలం నుంచి మెరుగ్గా ఉంటే విప్రో మాత్రం బలహీనంగా ట్రేడవుతోంది. ఈ రోజు స్టాక్ 4 శాతం నష్టపోయి రూ.373 దగ్గర క్లోజైంది. భారతి ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, వేదాంతా స్టాక్స్ 3 శాతం నష్టపోయాయి.
రిలయన్స్ నిప్పాన్ 7 శాతం, వినతి ఆర్గానిక్స్ 5 శాతం, సింఫనీ 3 శాతం, ప్రైమ్ ఫోకస్ 7 శాతం కోల్పోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+