పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వాయుసేన నిన్న అర్థరాత్రి జరిపిన దాడులు టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అయితే అదే సమయంలో ఫైనాన్షియల్ మార్కెట్లు కూడా ఈ దెబ్బను అంత ఫాస్ట్‌గా జీర్ణించుకోలేకపోయాయి. మొదట స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కాగా, కరెన్సీ మార్కెట్ కూడా కాస్త షాక్‌కు గురైంది.
డాలర్‌తో రూపాయి మారకం ఏకంగా 33 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో రూపాయితో డాలర్ మారకం 71.33 పైసల స్థాయికి పడిపోయింది. రూపాయి బక్కచిక్కడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని చెప్పొచ్చు.

అమెరికా ఎఫెక్ట్ కూడా
దిగుమతిదార్ల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి పతనానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. యూఎస్ డాలర్ ఇండెక్స్ పటిష్టంగా ఉంది. ఇతర అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే డాలర్ ఈ ఉదయం కాస్త స్థిరంగా ట్రేడవుతూ వస్తోంది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి కొద్దో గొప్పో హ్యాపీ ఎండింగ్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇరు దేశాలూ సయోధ్యకు రావొచ్చనే సంకేతాలు ఉన్న తరుణంలో అమెరికన్ డాలర్ కాస్త పుంజుకుంది.

క్రూడ్ పడ్డా మనకు ప్రయోజనం లేదు
ఓపెక్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న రాత్రి విరుచుకుపడ్డారు. క్రూడ్ ధరలు తగ్గించి తీరాల్సిందేనంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ రేట్లు 3 శాతం వరకూ పతనమయ్యాయి. వాస్తవానికి క్రూడ్ రేట్లు తగ్గినప్పుడు మన రూపాయి స్థిరంగా ప్రారంభం కావాలి. కాకపోతే అటు జియోపొటిలికల్ టెన్షన్స్ (భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం), అమెరికా డాలర్లకు డిమాండ్ కారణంగా రూపాయి బక్కచిక్కింది.

యుద్ధవాతావరణం
సాధారణంగా యుద్ధ వాతావరణం ఏ దేశంలో అయినా తలెత్తినప్పుడు వాళ్ల దేశ కరెన్సీ క్షీణిస్తుంది. ఎందుకంటే అవతలి వాళ్లు తిరిగి ప్రతిదాడి చేసినప్పుడు డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించరు. దీనికి తోడు విదేశీ సంస్థలు కూడా తమ పెట్టుబడులను ఉపసంహరిచుకుంటాయి. పెద్ద సంస్థలు కరెన్సీ బదులు గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. అంతే కాకుండా అమెరికన్ డాలర్ ఇప్పటికీ రిజర్వ్ కరెన్సీ హోదాను కొనసాగిస్తూనే ఉంది కాబట్టి పెద్ద సంస్థలు డాలర్‌ను దగ్గర ఉంచుకోవడానికే మొదటి ప్రయార్టీ ఇస్తాయి. యుద్ధం ఇచ్చే కిక్ బాగుంటుంది కానీ... ఆర్థికపరమైన అనేక విషయాలను కూడా ప్రభుత్వాలు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటాయి.


Click it and Unblock the Notifications