పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లో భారత వాయుసేన దాడులు సహా అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో మన దేశీయ స్టాక్ మార్కెట్లు నిస్తేజంగా మొదలయ్యాయి. మిగిలిన ఆసియా మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతన్నాయి. నిన్న ఆఖరి గంటలో వచ్చిన భారీ లాభాలన్నీ ఈ రోజు ప్రారంభంలో హరించుకుపోయాయి.
నిన్నటి క్లోజింగ్‌తో పోలిస్తే నిఫ్టీ సుమారు వంద పాయింట్ల నష్టంతో 10775 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఒక్క సెక్టోరల్ ఇండెక్స్ కూడా లాభాల్లో లేకపోవడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఆటో, మెటల్, ఫార్మా, రియాల్టీ రంగ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది.

మరో ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 270 పాయింట్లు నష్టపోయింది. కీలకమైన 36000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మరియు ప్రముఖ సూచీ బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారు 275 పాయింట్ల వరకూ నష్టపోయింది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా ఒకటిన్నర శాతం వరకూ నష్టపోయాయి. రెండు రోజులుగా లాభాల్లో కొనసాగిన రియాల్టీ స్టాక్స్‌లో సెల్లింగ్ ఎక్కువగా ఉంది. అన్సాల్ ప్రాపర్టీస్, పార్వ్‌శ్వనాధ్, గణేష్ హౌసింగ్, పెనిన్సూలా ల్యాండ్, డిబి రియాల్టీ వంటి మైక్రో క్యాప్ స్టాక్స్ 5 నుంచి 10 శాతం వరకూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్మాల్ క్యాప్ స్పేస్‌లో పురవంకర, హెచ్ డి ఐ ఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, కోల్డేపాటిల్ వంటివి 5 శాతం వరకూ కోల్పోయాయి.


Click it and Unblock the Notifications