పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నక్కిఉన్న జైషే మొహ్మద్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రభావాన్ని చూపించాయి. ప్రారంభం నుంచే నష్టాల్లో ఉన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత అనూహ్యంగా లాభాల్లోకి వచ్చినట్టు కనిపించినా చివరకు నష్టాల్లోనే ముగిశాయి. అయితే యాభై శాతానికిపైగా రికవరీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీకి ఇక రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఒలటాలిటీ కూడా ఎక్కువే ఉంది. చివరకు నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10835 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 240 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్లు కోల్పోయింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, టిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, హెచ్ సి ఎల్ టెక్, హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టాప్ 5 లూజర్స్ జాబాతిలో చేరాయి.ఉదయం సుమారు 100 పాయింట్ల నష్టంతో 10775 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ తర్వాత అనూహ్యంగా కోలుకుంది. ఏకంగా 130 పాయింట్లు రికవర్ అయి లాభాల్లోకి వచ్చినట్టు కనిపించింది. 10889 పాయింట్ల గరిష్ట స్థాయికి వచ్చింది. అయితే మళ్లీ ప్రాఫిట్ బుకింగ్ రావడంతో చివర్లో నీరసించింది. ఆటో, మెటల్, ఫార్మా, మీడియా రంగాలు మాత్రమే కొద్దిగా లాభపడ్డాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా లాభపడితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 1.04 శాతం నష్టాలతో ముగిసింది.

మీడియా స్టాక్స్ ఫోకస్
గత కొద్ది కాలం నుంచి నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ వస్తున్న మీడియా స్టాక్స్‌లో స్వల్పంగా బయింగ్ నమోదైంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 6 శాతం లాభాలతో రూ.471 దగ్గర క్లోజైంది. కొద్ది రోజుల్లోనే ఈ స్టాక్ అత్యంత వేగంగా 55 శాతానికి పైగా లాభాలను నమోదు చేయడం ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం. ఇదే బాటలో సన్ టీవీ నెట్వర్క్ కూడా 3.5 శాతం లాభపడింది. చివరకు రూ. 606 దగ్గర క్లోజైంది.
అదానీ పవర్'ఫుల్'
అదానీ పవర్ స్టాక్ ఏకంగా 20 శాతం లాభాలను నమోదు చేసింది. హర్యానా డిస్కమ్‌లతో పోరాడుతున్న ఓ కేసులో సుప్రీం కోర్టు నుంచి పాజిటివ్ తీర్పు రావడం వీళ్లకు కలిసొచ్చింది. గతంలో పెట్టిన ఖర్చులను నెలవారీ టారిఫ్‌లలో భాగంగా అడ్జస్ట్ చేసుకోవచ్చని సుప్రీం బెంచ్ తీర్పునిచ్చింది. ఇది వీళ్లకు కలిసొచ్చే అవకాశం ఉండడంతో అదానీ పవర్ స్టాక్ 20 శాతం పెరిగి రూ.48.55 దగ్గర క్లోజైంది.

రియల్ ఎస్టేట్ స్టాక్స్ వీక్
నిర్మాణంలో ఉన్న గృహాలపై జీఎస్టీ తగ్గింపు నేపధ్యంలో కొద్ది రోజుల నుంచి యాక్టివ్‌గా ఉన్న రియాల్టీ స్టాక్స్ ఈ రోజు కాస్త నేలచూపులు చూశాయి. ప్రధానంగా స్మాల్, మైక్రో క్యాప్ రియాల్టీ స్టాక్స్ 10 శాతం వరకూ కోల్పోయాయి.
ఇందులో భాగంగా పెనిన్సులా ల్యాండ్ 8.5 శాతం, అన్సాల్ ప్రాపర్టీస్ 8 శాతం, డిబి రియాల్టీ 5 శాతం, సన్ టెక్ రియాల్టీ 4 శాతం వరకూ నష్టపోయాయి. ఇదే బాటలో రిలయన్స్ హోం ఫైనాన్స్, డిహెచ్ ఎఫ్ ఎల్ స్టాక్స్ కూడా మూడు శాతం వరకూ కోల్పోయాయి.
డిహెచ్ఎఫ్ఎల్ మళ్లీ వీక్
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్ మళ్లీ నీరసించింది. ఈ సంస్థకు చెందిన రూ.8000 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్స్‌ను ఏ1ప్లస్ రేటింగ్ నుంచి ఏ2 ప్లస్ రేటింగ్‌కు డౌన్ గ్రేడ్ చేసింది.
దీంతో ఈ స్టాక్ ఒక దశలో 8 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 4.5 శాతం నష్టాలతో రూ.131 దగ్గర క్లోజైంది.
నిఫ్టీ నుంచి హెచ్ పి సి ఎల్ ఔట్
నిఫ్టీ 50 స్టాక్స్‌లో మార్పులు చేర్పులు చేసిన ఎక్స్ఛేంజ్ మార్చి 29నుంచి హెచ్ హి సి ఎల్‌ను తీసివేయబోతోంది. ఆ స్థానంలో బ్రిటానియాను చేర్చబోతోంది. సాధారణంగా తన వెయిటేజీలో భాగంగా ఎక్స్ఛేంజ్ ఇలాంటి మార్పులు చేయడం పారిపాటి. అయితే ఈ నిర్ణయం నేపధ్యంలో హిందుస్తాన్ పెట్రోలియం 1.5 శాతం నష్టపోగా, బ్రిటానియా 1 శాతం లాభపడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications