పెట్రోల్,డీజిల్ ధరలు మంగళవారం కూడా పెరిగాయి.
మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగినట్లు ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
న్యూఢిల్లి:మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగినట్లు ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెట్రోల్ ధర 9 పైసలు పెరగగా, డీజిల్ ధర 12-13 పైసలు పెరిగింది. ఢిల్లీలో మంగళవారం పెట్రోలు ధర 71.66 రూపాయలకు పెరిగింది. సోమవారం ధర రూ.71.57 రూపాయలు గా ఉంది. డీజిల్ ధర రూ.66.80 రూపాయలకు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు లీటర్కు రూ.77.29 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.70.10 రూపాయలు, నిన్న రేటు రూ.69.97 గా ఉండగా 13 పైసలు పెరిగింది.
చెన్నైలో రిటైల్ పెట్రోలు ధర 9 పైసలు పెరిగి రూ .74.41 కు చేరింది. డీజిల్ ధరలు కూడా 13 పైసలు పెరిగాయి నిన్నటి ధర రూ. 70.59 రూపాయలు. కోల్కతాలో పెట్రోలు రూ.73.67 రూపాయలు, సోమవారం 73.67 రూపాయల నుండి 9 పైసలు పెరిగి, డీజిల్ పై
12 పైసలు పెరిగి రూ.68.71 రూపాయల వద్ద నిలిచింది అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ వెల్లడించింది.
నోయిడాలో పెట్రోలు లీటరు రూ.71.30 రూపాయలు, డీజిల్ రూ.65.96 రూపాయలు ఖర్చు అవుతుంది.గురుగ్రం లో పెట్రోల్ ధర రూ. 72.04, డీజిల్ రూ. 66.29 రూపాయలు. అక్టోబర్ 2018 లో రిటైల్ పెట్రోల్ ధర అత్యధికంగా ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలకు చేరుకుంది అలాగే ముంబైలో రూ. 91 మార్కు దాటింది. అలాగే, బ్రెంట్ ఫ్యూచర్స్ - ముడి చమురు అంతర్జాతీయ బెంచ్మార్క్ - 2019 నాటికి 24.8 శాతం పెరిగాయి.
ముడి చమురు మార్కెట్లో క్రూడ్ ఫ్యూచర్స్ సోమవారం 3 శాతం క్షీణించింది. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ డాలరు 2.36 లేదా 3.5 శాతం క్షీణించాయి, గత ముగింపులో 64.76 డాలర్ల వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications