ఈ-వాలెట్ సంస్థలకు ఆర్బీఐ నిర్ణయం ఊరటనిచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లు ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ (కెవైసీ) నిబంధనలను పాటించాలని గతంలో ఆర్బీఐ వెల్లడించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28వ తేదీని డెడ్ లైన్‌గా విధించింది. అయితే దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించబోతున్నట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.
ఆధార్ ఈ-కెవైసీ నిబంధనలు విషయంలో ఆలస్యమవుతోందని, ఇందుకోసం మరింత సమయం కావాలని ఈ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు కోరిన నేపధ్యంలో గడువు పొడిగించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనతో తెలిపింది. ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ వినియోగిస్తున్న వారికి కెవైసీ పూర్తి చేసేందుకు మరో 6 నెలల గడువును ఇచ్చినట్టు వెల్లడించింది.

ప్రస్తుతం పేటిఎం, అమెజాన్ పే, ఫోన్ పే, మొబిక్విక్ వంటి సంస్థలు ఈ-వాలెట్ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ఈ డెడ్ లైన్ నేపధ్యంలో వాళ్లలో కంగారు ఎక్కువైంది. థర్ట్ పార్టీ సంస్థలను ఏర్పాటు చేసుకుని మరీ నో యువర్ క్లైంట్ నిబంధనలకు అనుగుణంగా వాటిని పూర్తిచేస్తూ వస్తున్నారు. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఊరట నేపధ్యంలో అటు ఈవాలెట్ సంస్థలు, ఇటు కస్టమర్లు కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications