ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బస్ ఏ 380 కు కష్టాలు...తాయారికి ముగింపు...
ఎయిర్ బస్ 380 తాయారి నిలుపుదల...
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఏ380 తయారికి స్వస్తి పలకనున్నాన్నట్టు ఏయిర్ బస్ ఎక్జిక్యూటివ్ టామ్ ఎండర్స్ ఇటివల ప్రకటించారు...దీన్ని ఆశించిన స్థాయిలో దీని అమ్మకాలు జరగక పోవడంతో తయారీని నిలిపివేస్తున్నట్టు చెప్పారు....దాదాపు 14 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడితో తాయారు చేస్తున్నప్పటికి ఇది అశించిన స్థాయిలో ప్రజాదరణ లేదని చెప్పారు..

ఎక్కువగా అమ్మకాలు లేకపోవడమే కారణం..
ఏప్రిల్ 2005 లో ప్రారంభమైన ఎయిర్ బస్ 380 గత పదమూడు సంవత్సరాల్లో కేవలం 313 విమానాలకు మాత్రమే పలు సంస్థల నుండి తయారికి అర్డర్లు వచ్చాయని కాని అందులో 234 మాత్రమే డెలివరి అయ్యాయని చెప్పారు...కాగా దీని ప్రారంభంలో ఇరవై సంవత్సరాల్లో ఎయిర్ ట్రాఫిక్ రెట్టింపు అవుతుందని అందులో భాగంగానే 1200 విమానాలకు అర్డర్లు వస్తాయని భావించామని కాని అలా జరగకపోవడంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు..

అత్యాధునిక సాంకేతికత...
ఎయిర్ బస్ 380 మిగతా విమానాలకంటే చాల శక్తివంతమైంది..నాలుగు ఇంజిన్లు కల్గిన విమానంలో 850 కి పైగా ప్రయాణికులు వెళ్లేందుకు అన్ని సదుపాయాలు ఉంటాయి..ఇది డబులు డెక్కర్ విమానం కాగా ఇందులో క్యాసినో లాంటీ విలాసవంతమైన రెస్టారెంట్ తో పాటు ప్రైవేట్ రూమ్స్, బార్ లాంటీ ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి..కాగా ఇది 9000 వేల మైళ్ల దూరం ఏకంగా ప్రయాణించగలదు..దీన్ని పలు దేశాల సహకారంతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు..ప్రారంభదశలో దుబాయ్ సింగపూర్ లకు నేరుగా నడిపింది..

ఆర్దిక సంక్షోభం...
కాగా 2008 లో వచ్చిన ఆర్ధిక పరిస్థితుల వల్ల ఎయిర్ ట్రాఫిక్ తగ్గింది..ఈనేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఎయిర్ ట్రాఫిక్ పై కోంత అనుమానాలు ఉన్న నేపథ్యంలో కోన్ని సంస్థలు దివాలా తీసే పరిస్థితి కూడ కనిపిస్తుంది..దీనికి అంతపెద్ద విమానంలో ఒకేసారి సుమారు 800 పైగా ప్రయాణికులు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు..దీంతో దీని తయారికి ముగింపు పలకాలనే నిర్ణాయానికి వచ్చారు నిర్వాహకులు...


Click it and Unblock the Notifications