ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం రిటైల్ ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోలు పై 14-16 పెరగగా, డీజెల్ ధరలు 15-17 పైసలు పెరిగాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం రిటైల్ ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోలు పై 14-16 పెరగగా, డీజెల్ ధరలు 15-17 పైసలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.57 రూపాయలకు పెరిగింది. ఆదివారం నాడు ధరలు రూ.71.42 రూపాయలుగా నమోదయ్యాయి. డీజిల్ ధర రూ.66.80 రూపాయలకు పెరిగింది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోలు కు రూ.73.67 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కోల్‌కతాలో లీటరు డీజిల్ రూ. 68.59 రూపాయలు నిన్నటి ధర రూ.68.43 రూపాయలగా నమోదయ్యాయి.
ముంబైలో రిటైల్ పెట్రోలు ధర 14 పైసలు పెరిగి రూ.72.20 కి చేరుకుంది. డీజిల్ ధర లీటరుపై 17 పైసలు పెరిగి రూ .69.80 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో పెట్రోలు లీటరు రూ.74.32 రూపాయలు, డీజిల్ ధర పై 17 పైసలు పెరిగి రూ.70.59 రూపాయలకు చేరుకుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
భారతదేశంలో రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడివుంటుంది. ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కన్నా అత్యంత చవకగా ఉన్నాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు పెరిగాయి. అమెరికా-చైనా ట్రేడింగ్ ఒప్పందంలో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేసింది. గత సెషన్లో అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ గత ముగింపులో 67.26 డాలర్లు, 14 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications