గూగుల్‌లో బ్యాంకుల పేరిట నకిలీ కాల్‌ సెంటర్ల నంబర్లు

రోజు రోజుకు సైబర్ నేరాగాళ్లు అగాడాలు మితిమీరుతున్నాయి..తమ ఖాతాల్లోకి చోచ్చుకువచ్చి డబ్బును మాయం చేస్తున్నారు..పక్కా ప్లాన్ తో ఖాతాదారుల్లో ని డబ్బును మాయం చేస్తున్నారు....సాంకేతిక విప్లవాన్ని ఆసరా చేసుకుని ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు... తాజాగా గూగుల్ ను సైతం మాన్యుప్లేట్ చేసి ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు..అయితే ఎట్లా జరుగుతోంది..దాన్ని ఎట్లా నివారించుకోవాలో హైద్రబాద్ పోలీసులు వివరిస్తున్నారు...

బోగస్ కాల్ సెంటర్లతొ ఏర...

బోగస్ కాల్ సెంటర్లతొ ఏర...

ఏటిఎమ్ లో మీరు డబ్బులు డ్రా చేశారా....డబ్బులు డ్రా అయినట్టు మెసెజ్ వచ్చి..డబ్బులు మాత్రం రాలేదా....అయితే తోందరపడి ఆయా బ్యాంకు కాల్ సెంటర్ కు ఫోన్ చేయకండి..ఎందుకంటే బ్యాంక్ కాల్ సెంటర్లో కూడ ఫేక్ నెంబర్లు వస్తున్నాయి..బ్యాంక్ కాల్ సెంటర్ ల నెంబర్ గూగుల్ సెర్చ్ లో ప్రధాన నంబర్లుగా వచ్చేలా చేస్తున్నారు..ఒక వేళ ఖాతాదారుడు ఆ నంబర్ కు కాల్ చేస్తే ... దీంతో వినియోదారుడి యూపిఐ పిన్ తో మోసం చేస్తున్నారు....దీంతో ఖాతాలోని ఉన్న డబ్బులు సైతం కొట్టి వేస్తున్నారు.....

ఏటిఎమ్ ల సాంకేతిక లోపాలే ఆసరాగా మోసాలు...

ఏటిఎమ్ ల సాంకేతిక లోపాలే ఆసరాగా మోసాలు...

ఈ మధ్య ఖాతాదారులు రోజు వారి అవసరాల కోసం డబ్బుల విత్ డ్రా చేసుకునేందుకు నేరుగా బ్యాంకులకు వెళ్లడం లేదు..కోద్దిపాటి అమౌంట్ కోసం ఎక్కువగా ఏటిఎమ్ లపై ఆధారపడుతున్నారు..దీంతో కోన్ని సంధర్బాల్లో ఏటిఎమ్ లలో వచ్చే సాంకేతిక సమస్యల వల్ల అన్ని ఏటిఎమ్ లలో డబ్బులు ఉండని పరిస్థితి ఒకవేళా ఉన్నా అవి బయటకు రావు....ఇక కొన్ని సంధర్భాల్లో డబ్బులు వచ్చినట్టు మెసెజ్ వస్తుంది..కాని డబ్బులు మాత్రం బయటకు రాని పరిస్థితి దీంతో ఖాతాదారుడు కంగారుపడే అవకాశం ఉంటుంది...అయితే ఈ పరిస్థితిని సైబర్ నెరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు...

సాధరణంగా ఖాతాదారుడు ఏటిఎమ్ లలో మెసెజ్ వచ్చి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెంది వెంటనే అందుబాటులో ఉన్న బ్యాంక్ కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తున్నాడు.. లేదంటే ఆయా బ్యాంకులకు ఫోన్ చేస్తున్నాడు...అయితే ఆ వినియోగదారుడు చేస్తున్న కాల్ సెంటర్ ఫేక్ నంబర్ అయి ఉంటుంది.....ఈ నేపథ్యంలోనే గూగుల్ తో పాటు ఇతర మార్గాలను కూడ వాడుకుంటున్నారు...

ఎంపిన్‌తో ఎర..

ఎంపిన్‌తో ఎర..

ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐగా పిలిచే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్‌ అయిన సెల్‌ఫోన్‌ నుంచి యూపీఐకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌ నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

స్వంత యాప్ లకు అనుసంధానం...

స్వంత యాప్ లకు అనుసంధానం...

ఖాతాదారుడు డబ్బులు పోయిన కంగారులో గూగుల్ సెర్చ్ లో బ్యాంకు కు కాల్ సెంటర్ కోసం వెతుకుతారు, అందులో వచ్చిన ఫేక్ నంబర్ కు ఫోన్ చేస్తారు..ఆ గూగుల్ సెర్చ్ ఉన్నఫేక్ బ్యాంకు నెంబర్ కు ఫోన్ చేయగానే ఎంపిన్ కు క్రియోట్ చేస్తున్నారు..దీన్ని ముందుగా తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నంబర్ నుండి పంపిస్తున్నారు...అలా వచ్చిన ఎంపిన్ బ్యాంక్ నంబర్ కు పంపించాలని చెబుతున్నారు...ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్ తో అనుసంధానించడానికి ఆక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది..ఆ వెంటనే సదరు నంబర్ నున వినియోగించి యాప్ ను ఆక్టివేట్ చేయడంతో పాటు ఖాతాదారుడి అకౌంట్ నుండి డబ్బును కాజేస్తున్నారు...ఈ విధంగా ప్రతి రోజు కొన్ని బ్యాంకుల్లో 50 వేల నుండి లక్ష వరకు బదీలీ తచేసుకునే అవకాశం ఉంది...

ట్రూ కాలర్ మరియు గూగుల్‌లో ఫేక్ రిజిస్ట్రేషన్.. ....

ట్రూ కాలర్ మరియు గూగుల్‌లో ఫేక్ రిజిస్ట్రేషన్.. ....

ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్‌లోకి ఎంటర్‌ అవుతున్న సైబర్ నేరగాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్‌ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం ‘బ్యాంక్‌ మేనేజర్‌'పేర్లతోనే రిజిస్టర్‌ చేసుకున్నారు. దీంతో సదరు సైబర్‌ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్‌ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచిన తప్పుడు కాల్‌ సెంటర్ల నంబర్లే పైభాగంలో కనిపిస్తుంటాయి. ఇలా కనిపించిన కాల్‌ సెంటర్‌ నంబర్‌కు ఖాతాదారుడు కాల్‌ చేసిన వెంటనే అది సదరు సైబర్‌ నేరగాడికి వెళ్తుంది. తాను బ్యాంక్‌ మేనేజర్‌ని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్‌ నుంచి ఓ ఎస్సెమ్మెస్‌ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు పంపించాలని సూచిస్తుంటారు.

సైబర్ పోలీసుల జాగ్రత్త చర్యలు...

సైబర్ పోలీసుల జాగ్రత్త చర్యలు...

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్‌ను ఎవరి సెల్‌ నంబర్‌కు పంపకూడదని పోలీసులు చెబుతున్నారు... మెసేజ్‌ వచ్చినా ఏటీఎం నుంచి డబ్బు రాకుంటే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. గూగుల్‌లో చూసి అవి బ్యాంకుల కాల్‌ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. అనేక సందర్భాల్లో ఏటీఎం మిషన్‌ నుంచి బయటకు రాని డబ్బులు రెండు మూడు పని దినాల్లో తిరిగి ఖాతాలోకి జమవుతూ ఉంటాయి. అపరిచితులు, ఫోన్‌ ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమని సూచిస్తున్నారు.. సాధారణంగా గూగుల్‌లో కనిపించే వివరాలన్నీ ఎవరో ఒకరు పోస్ట్‌ చేసిన, అప్‌లోడ్‌ చేసినవే అయి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందులో కనిపించిన ప్రతి అంశాన్నీ గుడ్డిగా నమ్మకూడదు..

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+